E-Paper
Advertisement

Double ISMART: బిగ్ బుల్ సాంగ్.. పక్కా పూరి మాస్ యాంథెమ్

Double ISMART: బిగ్ బుల్ సాంగ్.. పక్కా పూరి మాస్ యాంథెమ్
Advertisement

Double ISMART: ఇస్మార్ట్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా పూర్తీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. రామ్- పూరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరక్కింది. ఈ సినిమాను పూరి – ఛార్మీ కలిసి నిర్మించారు. ఇక డబుల్ ఇస్మార్ట్ అని టైటిల్ లోనేకాకుండా సీక్వెల్ లో స్టార్ హీరో సంజయ్ దత్ ను దింపి.. డబుల్ పవర్ ఉందని చూపించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని షురూ చేసిన మేకర్స్.. ఒకపక్క హీరోతో ఇంటర్వ్యూలు చేస్తూనే .. ఇంకోపక్క సినిమాలో మిగిలిన సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Advertisement

తాజాగా డబుల్ ఇస్మార్ట్ నుంచి బిగ్ బుల్ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ మొత్తం పక్కా పూరి మాస్ యాంథెమ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కెక్కి తొక్కుడే.. దునియా దున్నుడే.. రేపు కాదు ఇప్పుడే అంటూ సాగిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. పూరి ఇంటర్వ్యూలు విన్నవారికి ఆయన ఆలోచనలు ఎలాంటివి అని బాగా అర్దమవుతూ ఉంటాయి. జీవితంలో ఏది శాశ్వతం కాదని, సమాజంలో ఏది చేసినా ఎవరో ఒకరు తప్పు పడతారని చెప్పుకొస్తూ ఉంటాడు.

ఇక ఆ ఆలోచనలకు కార్యరూపం దాలిస్తే ఈ సాంగ్ అన్నట్లు ఉంది. లిరిసిస్ట్ భాస్కరభట్ల అలా పూరి ఆలోచనలను మొత్తం కలిపి రాసినట్లు కనిపిస్తుంది. కోసి కారమెట్టుడే ఒప్పకపోతే.. ఊచకోత కోసుడే తప్పకపోతే అంటూ డబుల్ ఇస్మార్ట్ క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక వీడియోలో బిగ్ బుల్ గా ఒకపక్క సంజయ్ దత్, ఇంకోపక్క రామ్ డ్యాన్స్ అదిరిపోయింది. మొత్తానికి ఈ ఒక్క సాంగ్ ఊర మాస్ గా అనిపించిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ బావుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×