BigTV English

Mangala Gowri Vratham 2024: మంగళగౌరీ వ్రతం.. పూజా విధానం, పాటించాల్సిన నియమాలు

Mangala Gowri Vratham 2024: మంగళగౌరీ వ్రతం.. పూజా విధానం, పాటించాల్సిన నియమాలు

Mangala Gowri Vratham 2024: శ్రావణ మాసంలోని మంగళవారానికి చాలా ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసం మూడవ మంగళవారం గౌరీ వ్రతం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో పరమశివుడు, పార్వతి అమ్మవారిని పూజిస్తుంటారు. ఇదే కాకుండా శ్రావణ మాసంలో అనేక ఉపవాసాలు, పండుగలు కూడా జరుపుకుంటారు. శ్రావణ మాసం ఆరాధనకు మంచి సమయంగా భావిస్తారు.


సాధారణ శ్రావణ సోమవారం శివ భక్తులు ఉపవాసం పాటించి ఆలయానికి వెళ్లి జలాభిషేకం చేసారు. అదే విధంగా శ్రావణ మాసంలోని మంగళవారాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది.మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు మాతా మంగళ గౌరీకి అంకితం చేయబడ్డాయి. శ్రావణ మాసంలో మంగళవారం మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ మాసంలో మంగళవారం మంగళగౌరీ వ్రతం ఆచరించి వివాహిత స్త్రీలు తమ భర్తల సంతోషం కోసం శ్రేయస్సు కోసం ఉపవాసాలు ఉంటారు.పెళ్లికాని అమ్మాయిలు కోరుకున్న వారిని పొందడం కోసం మంగళగౌరీని పూజిస్తారు.

Also Read: నాగ పంచమి పూజ.. పాటించాల్సిన నియమాలు


ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంగళ దోషాలు తొలగిపోతాయని, వివాహ సంబంధమైన ఆటంకాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఇదే కాకుండా వివాహం ఆలస్యమవుతున్న లేదా వారి జాతకంలో దోషాలు ఉన్న వారు కూడా మంగళగౌరీ వ్రతం రోజున కొన్ని పరిహారాలు చేయాలి. మంగళ గౌరీ వ్రతానికి సంబంధించిన పరిహారాలు.. పూజా విధానం, మంత్రాలు, ఉపవాస నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళగౌరీ వ్రత పూజా విధానం:
మంగళగౌరీ వ్రతం చేయాలని నిర్ణయించుకున్న రోజు ఉదయం లేచి తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. గౌరీదేవిని ధ్యానిస్తూ ఉపవాసం ఉంటానని ప్రమాణం చేయాలి. ఆ తర్వాత ఇంట్లోని పూజా స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ గౌరీదేవి విగ్రహాన్ని, చిత్రపటాన్ని ఉంచాలి. పూజ కోసం నైవేద్యం, నీరు, అక్షితలు, పువ్వులు, దీపం, సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఎరుపు రంగు బట్టలు, వస్త్రాలు సమర్పించి ఆచారాల ప్రకారం పార్వతీదేవిని పూజించాలి. తర్వాత నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి.

పూజ కోసం లడ్డులు, తమలపాకు, పాన్, లవంగాలు, యాలకులు,గాజులు మొదలైన అన్ని వస్తువుల సంఖ్య 16 ఉండేలా చూసుకోవాలి. పూజా సామగ్రి సమర్పించిన తర్వాత మంగళగౌరీ కథను వినాలి. పూజ తర్వాత మీ భర్త దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించండి.

ఉపవాస నియమాలు:
పూజ చేయడానికి ముందుగానే ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ తీసుకోవాలి. రోజంతా సంయమనంతో ఉండి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మనసు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. పూజ పద్ధతిని సరిగ్గా అనుసరించాలి. మంత్రాలను కూడా జాగ్రత్తగా జపించాలి. ఈ రోజు నలుపు, నీలం రంగు దుస్తులు ధరించకుండా ఉండటం మంచిది. భగవంతునికి నైవేద్యం సమర్పించిన తర్వాత స్వయంగా ఆహారం తీసుకోవాలి. ఉపవాసం రోజున పేదవారికి దానం చేయడం మంచిది.

మంత్రం:
ఓం శ్రీ గౌరీ శంకరాయ నమః
హ్రీం శ్రీం క్లీం గౌరీ మంగళాయ నమః

  • వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మంగళగౌరీ వ్రతం ఆచరించడం మంచిది. వివాహిత స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ సమయంలో అవసరమైన వారికి తేనెను దానం చేయండి. తర్వాత మహావిష్ణువను కూడా పూజించండి.

Also Read: వరలక్ష్మీ వ్రతం ఏ తేదీన జరుపుకోవాలి ? పూజా విధానం..

  • మంగళగౌరీ వ్రతం ఆరాధన సమయంలో ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న కుజ దోషం తొలగిపోతుంది. ఈ వ్రతం వల్ల శివుడు, తల్లి పార్వతి యొక్క ఆశీస్సులను అందుతాయి. మంగళగౌరీ వ్రతాన్నిపూర్తి చేసుకున్న తర్వాత పేదలకు ఎర్రపప్పును దానం చేయండి. దీని వల్ల జాతకంలో కుజుడు బలహీన పడతాడు.

Related News

Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

Mahabhagya Yoga 2025: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Vastu Tips: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇలా పూజిస్తే.. సంపద, శ్రేయస్సు !

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్ గణేశుడి లీలలు తెలుసుకుందాం రండి!

Tirumala Special: ఏరువాడ పంచెల రహస్యం ఇదే.. శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోండి!

Big Stories

×