BigTV English

Pushpa2 : ‘ పుష్ప2 ‘కు భారీ షాక్.. రిలీజైన రోజే ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్..

Pushpa2 : ‘ పుష్ప2 ‘కు భారీ షాక్.. రిలీజైన రోజే ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్..

Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప2( Pushpa 2 ) సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ సినిమాకు అన్ని ప్రాంతాలలో కూడా మంచి టాక్ అందుకుందనే వార్తలు వినిపించడంతో అభిమానులు అలాగే చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఇదివరకే రిలీజ్ అయి ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప 2 నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంది.? 300 కోట్లు మొదటి రోజు రాబడుతుందని అందరు అనుకున్న సమయంలో పుష్ప 2 టీమ్ భారీ షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఇలాంటివి జరగడం తో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


గతంలో వచ్చిన భారీ యాక్షన్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలాంటి పుష్ప టీమ్ కు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ‘పుష్ప 2’ చిత్ర బృందం మూడు సంవత్సరాల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు లీకు రాయుళ్ళు.. సినిమా రిలీజ్ అయ్యి, మొదటి షో కూడా పూర్తి కాకముందే హెడ్డి ప్రింట్ ప్రస్తుతం పలు పైరసీ వెబ్సైట్లలో అందుబాటులో ఉండడం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మూవీ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా ఇలా పైరసీ సైట్లలో సినిమా లీక్ అయ్యింది. పైగా పెద్దగా క్లారిటీ లేని ప్రింట్ కాకుండా, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ సినిమా హెచ్డి ప్రింట్ అందుబాటులో ఉండడం గమనార్హం.. ఈ సినిమా ఒక్కటీ, రెండు వెబ్ సైట్ లో మాత్రమే కాదు ఏకంగా పదుల సంఖ్యల వెబ్ సైట్ లలో దర్శనం ఇవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది.

ఏదో నార్మల్ ప్రింట్ కూడా కాదు హై క్వాలిటి కలిగిన ప్రింట్ తో మూవీ రిలీజ్ అవ్వడంతో చిత్ర యూనిట్ సైతం షాక్ అయ్యిందనే చెప్పాలి. Filmyzilla, Telegram, Tamilrockerz, Ibomma, Movierulz, TamilYogi, Tamilblasters, Bolly4u, Jaisha Moviez, 9xmovies, Moviesda వంటి ఆన్ లైన్ వెబ్ సైట్ లలో ఈ మూవీ దర్శనం ఇచ్చింది. సినిమా లీక్డ్ వెర్షన్ ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే లింకులు అన్నీ దర్శనం ఇస్తున్నాయి. మూవీ ఈ విధంగా లీక్ కావడం వల్ల కలెక్షన్లపై దారుణంగా దెబ్బ పడే ఛాన్స్ ఉంది. భారీగా టికెట్ రేట్లు పెంచినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. పైగా సినిమా కోసం రేయీ పగలూ తేడా లేకుండా కష్టపడినదంతా వృధా అయిపోయిందనే చెప్పాలి. ఈ పైరసి పై ఎంత త్వరగా చర్యలు చేపడితే అంత మంచిది.. లేకుంటే పుష్ప 2 కు నష్టాలు తప్పవని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ మొదటి రోజు దాదాపు రూ. 260 కోట్లు వసూల్ చేసిందని టాక్..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×