Pushpa 2 Movie : గత కొద్ది రోజులుగా కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచిన సినిమా పుష్ప 2. ఇదివరకే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ స్థాయిలో ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోని డైలాగ్స్,మ్యానరిజమ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అటువంటి సినిమాకి సీక్వెల్ గా సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రేక్షకులలో క్యూరియాసిటీ ఉంటుంది. ఇక ఈ చిత్ర యూనిట్ కూడా సినిమా మీద భారీ అంచనాలను పెంచుతూ వచ్చింది. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా పుష్ప 2 అస్సలు తగ్గేదెలే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అలా మేకర్స్ మాట్లాడుతున్న ప్రతిసారి ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు అవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు జాతర సీన్ గురించి చాలామంది చెబుతూ వచ్చారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సీక్వెన్స్ నుంచి ఒక సీన్ ను రిలీజ్ కూడా చేశారు. అక్కడితో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
కొన్ని సినిమాలకు కథ, కథనం కొన్ని సన్నివేశాలు మైనస్ గా మారే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులలో ఎక్స్పెక్టేషన్స్ పెంచడం మైనస్ అయింది. ముందు ఈ సినిమాకి సంబంధించి వేర్ ఇస్ పుష్ప అని ఒక వీడియోను రిలీజ్ చేశారు. వాస్తవానికి ఈ వీడియో చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఇక అడివిలో పులికి ఎదురెళ్లి వ్యక్తిగా పుష్ప దానిలో కనిపిస్తాడు. పుష్ప ను చూసిన తర్వాత పులి రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది. ఆ డైలాగ్ తోని సుకుమార్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. అయితే అప్పుడు కథ విషయంలో ఒక కొత్త వెర్షన్ ఒకటి బయటకు వచ్చింది. పుష్ప రాజు అడవిలో ఉంటూ, ఆడవేషంలో వచ్చి విలన్స్ పై జాతరలో ప్రతీకారం తీర్చుకుంటాడు అంటూ కొన్ని కొత్త కొత్త కథలు వినిపించాయి. అవి వినడానికి కూడా బాగానే అనిపించేవి. కానీ జాతర సీన్ కి ఆ కథకి అసలు సంబంధం లేదు.
ఇకపోతే ఈ సినిమాలో జాతర సీక్వెన్స్ బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ సీక్వెన్స్ మినహాయిస్తే సెకండ్ హాఫ్ లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఏవి ప్రేక్షకులకు అనిపించలేదు. మామూలుగా ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా చూస్తే అద్భుతంగా చాలామందికి నచ్చుతుంది. కానీ పుష్ప అంటేనే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి, అది అందుకు ఒక పోవడం వలన కొద్దిపాటి నిరాశ ఉంటుంది. ఇక ముందు నుంచి టీం చెబుతున్నట్లు జాతర సీన్ బాగానే వర్కౌట్ అయింది. కానీ టీం ఒక జాతర సీను గురించే చెప్పడం వలన ప్రేక్షకులు అంచనాలన్నీ కూడా దానిమీద బీభత్సంగా పెరిగిపోయాయి. ప్రేక్షకులు ఆల్రెడీ అది అద్భుతంగా ఉంటుందని ఫిక్స్ అయిపోయి దానిని చూడడం మొదలుపెట్టారు. అలా ఈ సీన్ గురించి పదే పదే చెప్పకుండా ఉండి ఉంటే థియేటర్లో ఇది ఒక సర్ప్రైజింగ్ థింగ్ లా అనిపించేది. ఏదేమైనా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే పుష్పరాజు ఖచ్చితంగా నచ్చుతాడు.
Also Read : Pushpa 2 Movie : నార్త్ ఇండియాలో పుష్ప బ్రాండ్ కొనసాగిందా..? అసలు ఆడియన్స్ ఏం అంటున్నారంటే..?