E-Paper
Advertisement

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..
Advertisement

Big TV Kissik Talks: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ.. జనాలకు ప్రపంచంలో జరిగే వార్తలను అందించడంతో పాటుగా ఎంటర్టైన్ చేయడంలో కూడా ఈ ఛానల్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రోగ్రామ్ లను అందిస్తుంది. ఇటీవల ఈ ఛానెల్ కిస్సిక్ టాక్ షోను స్టార్ట్ చేశారు.. ఈ షో ని స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ ను అందుకోవడం విశేషం. జబర్దస్త్ యాంకర్ వర్షా ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే ఎంతోమంది ఈ షో కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఈ షోకు పటాస్ ప్రవీణ్ గెస్ట్ గా వచ్చాడు. ఇందులో తన గురించి ఎన్నో విషయాలను ప్రవీణ్ పంచుకున్నారు.. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు. తండ్రి మరణం తర్వాత అతను చేసిన పని గురించి బయటపెట్టారు.. పైకి నవ్వుతూ కనిపించే ప్రవీణ్ మనసులో ఎంత బాధ ఉందో అన్నది ఈ షోలో బయటపెట్టారు.. ప్రవీణ్ తన గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

తండ్రి మాట నిలబెట్టాను..

పటాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కమెడియన్ ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆ షోలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. అలా టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న కామెడీ షోలు అన్నిటిలో కూడా ప్రవీణ్ పాల్గొన్నారు.. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు.. తాజాగా ప్రవీణ్ కిస్సిక్ టాక్స్ షోకి గెస్టుగా వచ్చారు.. ఇందులో భాగంగా తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితంలో తాను పడ్డ కష్టాలను అందరికీ తెలిసేలా చేశాడు ప్రవీణ్.. తండ్రి మరణించిన తర్వాత అతను తీర్చలేని అప్పులను ప్రవీణ్ తీర్చినట్లు చెప్పాడు. మా నాన్న చాలా మందికి మంచి చేశాడు కానీ ఆయన పోయిన తర్వాత అందరూ మోసం చేశారు.. ఎన్నో అప్పులు వచ్చి మీద పడ్డాయి.. వాటిని నేను తీర్చేసాను అని ప్రవీణ్ తండ్రిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

నాకు నచ్చిందే చేస్తాను..

Advertisement

డబ్బులు ఉన్నప్పుడు అక్కడికి వెళ్లాలి ఇక్కడికి వెళ్లాలి అని చాలామంది అనుకుంటారు. అయితే అంత డబ్బులు సంపాదించి మనం వెళ్లాలనుకున్న ప్రాంతాలకు వెళ్లలేకపోవచ్చు. కానీ నేను మాత్రం నాకు నచ్చినట్లు చేస్తాను. ఇవాళ నా చేతిలో డబ్బులు ఉన్నాయి అంటే నాకు నచ్చిన ప్లేస్ కు వెళ్లి ఏమి చూడాలనుకుంటే అవి చూస్తాను. ఈరోజు ఉన్నది రేపు లేదు కాబట్టి నాకు నచ్చింది నేను చేస్తాను అని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకొని ప్రవీణ్ ఎమోషనల్ అయ్యారు.

జబర్దస్త్ షో పై వర్ష ప్రశంసలు..

వర్ష ప్రవీణ్ ని జబర్దస్త్ షో ద్వారా నువ్వు ఏదైనా గొప్పగా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. కమెడియన్ గా నన్ను నేను నిరూపించుకున్నాను అని ప్రవీణ్ అంటాడు. మరి జబర్దస్త్ లో నువ్వు కూడా చేశావు కదా నువ్వెలా ఫీలవుతున్నావు అని ప్రవీణ్ వర్షాని అడుగుతాడు. వర్ష జబర్దస్త్ షో నా కుటుంబాన్ని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చింది. నన్ను వద్దనుకుని చాలామంది వెళ్లిపోయారు కానీ ఈ షో ద్వారా అందరూ నాకు మళ్ళీ దగ్గర అయ్యారు అని వర్షా ఎమోషనల్ అవుతుంది. ఒకప్పుడు తనని బాధ పెట్టిన వాళ్లే ఇప్పుడు తనకు దగ్గరయ్యారు అని చెప్పుకొని జబర్దస్త్ పై ప్రశంసలు కురిపించింది.

Advertisement

Also Read :బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

జీవిత సత్యాన్ని చెప్పిన ప్రవీణ్.. 

ఈ రోజుల్లో డబ్బులు సంపాదించాలి అన్న కోరికతో చాలామంది తమ కోరికలని అణిచి వేసుకుంటున్నారు.. మనం ఎంత సంపాదించినా కూడా చివరికి వెళ్లేది కాటికే కదా.. అందుకే జీవితాన్ని ఎప్పటికప్పుడు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నాలు చేయాలి అని జీవిత సత్యాన్ని చెప్తాడు ప్రవీణ్.. డబ్బులు ఉన్నప్పుడే మనం చేయాలనుకున్నది చేయాలి. ఎప్పుడూ జీవితం వెళ్లిపోతుందో చెప్పడం కష్టమే అని ప్రవీణ్ ఎన్నో విషయాలను ఈ షో ద్వారా పంచుకున్నారు.. ప్రస్తుతం ప్రవీణ్ ఎపిసోడ్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×