E-Paper
Advertisement

Bigg Boss Sohel : సోహైల్ ఇంట పెను విషాదం… అనారోగ్యంతో తల్లి కన్నుమూత

Bigg Boss Sohel : సోహైల్ ఇంట పెను విషాదం… అనారోగ్యంతో తల్లి కన్నుమూత
Advertisement

Bigg Boss Sohel : బిగ్ బాస్ కంటెస్టెంట్, టాలీవుడ్ యాక్టర్, హీరో సోహైల్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. సోహైల్ తల్లి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు తెలుస్తోంది.

తీవ్ర విషాదంలో సోహైల్ 

Advertisement

సోహైల్ కరీం నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి పేరు సయ్యద్ సలీం, తల్లి పేరు ఫైమా సుల్తానా. తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. సమాచారం ప్రకారం గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సోహైల్ తల్లి ఫైమా సుల్తానా డయాలసిస్ కోసం మెడికవర్ హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. కానీ తాజాగా ఆసుపత్రిలోనే ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచినట్టు సమాచారం. దీంతో సోహైల్ తో పాటు ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని స్వస్థలం అయిన కరీం నగర్ తరలిస్తున్నారు. అక్కడే అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు. ఇక ఈ విషయం తెలిశాక ఆయన అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సోహైల్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన తల్లి మృతికి నివాళులు అర్పిస్తున్నారు.

సోహైల్ సినిమా కెరీర్ 

Advertisement

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సోహైల్ బిగ్ బాస్ తెలుగు 4 అనే బుల్లితెర రియాలిటీ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఆ షో నుంచి బయటకు వచ్చాక లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలలో హీరోగా నటించాడు. అయితే ఇన్ని సినిమాలలో నటించినా సోహైల్ ను ప్రేక్షకులు ఆదరించలేదు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది సోహైల్ కు. కానీ అతన్ని ప్రేక్షకులు మాత్రం హీరోగా అంగీకరించలేక పోయారు. దీంతో ఒకానొక టైమ్ లో తన సినిమాను చూడమని వేడుకుంటూ స్టేజ్ పైనే కన్నీళ్ళు పెట్టుకున్నాడు సొహైల్.

బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు అరియానాతో గొడవ పడిన సొహైల్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆమెతో మంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడు. అలాగే ఎన్నో ట్రోలింగ్స్ ను కూడా ఎదుర్కొన్నాడు. తన సినిమాలను ప్రేక్షకులు ఆదరించకపోవడానికి కారణం రివ్యూలు అంటూ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. కనీసం మూవీ ఫస్ట్ షో కూడా పూర్తి కాకముందే రివ్యూలు వేస్తే చూడాలి అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతారు అంటూ ఫైర్ అయ్యాడు. అయితే ఆశ్చర్యకరంగా సోహైల్ ఏడిస్తే సింపతీ రాకుండా తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. ఇక ఆ తరువాత సోహైల్ నుంచి ఇప్పటిదాకా నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కన్పించలేదు. తాజాగా ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది అన్న విషయంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×