E-Paper
Advertisement

Salman Khan Ramdan Treat: సల్మాన్ ఖాన్, మురుగదాస్ కొత్త సినిమా.. రంజాన్ సర్‌ప్రైజ్ అదిరిపోయింది!

Salman Khan Ramdan Treat: సల్మాన్ ఖాన్, మురుగదాస్ కొత్త సినిమా.. రంజాన్ సర్‌ప్రైజ్ అదిరిపోయింది!
Advertisement

Salman Khan’s Sikandar Movie Update: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా కాలమే అయింది. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నా.. బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. గతేడాది కిసీ కా భాయ్ కిసీ కి జాన్, టైగర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు పర్వాలేదనిపించాయి.

దీంతో తాను తీయబోయే తదుపరి సినిమాపై సల్మాన్ ఫుల్‌గా ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ – సల్మాన్ ఖాన్ మూవీ త్వరలో ఉండబోతుందని ఎప్పట్నుంచో వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు తాజాగా నిజమయ్యాయి. వీరిద్దరి కాంబో ఫిక్స్ అయింది. రంజాన్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ అందించారు.

Advertisement

ఈ మేరకు మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి గానూ ‘సికందర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌ట్రైనర్‌గా రూపొందబోతున్న ఈ సినిమాను సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్ పండుగకు రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో నటించబోతున్న నటీ నటులకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో అంటే దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Also Read: Sabdham Teaser: హర్రర్ లవర్స్ సిద్ధంగా ఉండండి.. ఈసారి ఆది భయపెట్టడానికి వస్తున్నాడు

Advertisement

ఇక గజిని, తుపాకీ, స్టాలిన్, 7th సెన్స్ వంటి సినిమాలను తెరకెక్కించి అద్భుతమైన హిట్లను అందుకున్నాడు దర్శకుడు మురుగదాస్. ఆ తర్వాత మహేశ్ బాబుతో స్పైడర్, రజనీకాంత్‌తో దర్బార్ సినిమాలను తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి.

దీంతో మురుగదాస్ కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడు కొత్త కథలతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×