E-Paper
Advertisement

Sabdham Teaser: హర్రర్ లవర్స్ సిద్ధంగా ఉండండి.. ఈసారి ఆది భయపెట్టడానికి వస్తున్నాడు

Sabdham Teaser: హర్రర్ లవర్స్ సిద్ధంగా ఉండండి.. ఈసారి ఆది భయపెట్టడానికి వస్తున్నాడు
Advertisement

Sabdham Teaser: యంగ్ హీరో ఆది పినిశెట్టి కి ప్రస్తుతం ఒక పెద్ద హిట్ అవసరం. మొదటి నుంచి కూడా ఆది.. హీరోగానే ఎదగాలి అనుకోలేదు.. నటుడిగా ఎదగాలనుకున్నాడు. అలాగే హీరో, విలన్, సపోర్టివ్ రోల్స్ అంటూ ఏది నచ్చినా చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం శబ్దం. అరివళగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7జి ఫిల్మ్స్ బ్యానర్ పై 7జి శివ నిర్మిస్తున్నాడు. హర్రర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆదితో పాటు సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే శబ్దం సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను దగ్గుబాటి వెంకటేష్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సినిమాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండానే టీజర్ లో భయపెట్టే ఎలిమెంట్స్ ఉన్నట్లు చూపించారు. ఈ కథ అంతా ఒక కాలేజ్ లో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాలేజ్ లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం.. ఆ తరువాత నుంచి కాలేజ్ లో కొంతమందికి దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేయడం.. చెవుల్లో గట్టి శబ్దం వచ్చి చనిపోవడం లాంటివి చూపించారు.

Advertisement

ఇక ఆ కాలేజ్ కు ఆది రావడం.. అక్కడ జరుగుతున్న సంఘటనలపై ఇన్వెస్టిగేషన్ చేయడం చూపించారు. ఇందులో సిమ్రాన్ ప్రొఫెసర్ గా కనిపించింది. ఇక చివర్లో దెయ్యం కదలడం చూపించి భయపెట్టారు. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై హైప్ తెచ్చారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఆది ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×