E-Paper
Advertisement

Sofia Hayat: సన్యాసం పుచ్చుకున్న హాట్ హీరోయిన్..

Sofia Hayat: సన్యాసం పుచ్చుకున్న హాట్ హీరోయిన్..
Advertisement

Sofia Hayat: జీవితం మీద విరక్తి వచ్చినవారు, జీవితం మొత్తం చూసినవారు.. సన్యాసులుగా మారతారు అంటారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సోఫియా హయత్ కూడా సన్యాసిగా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. సోఫియా.. టీవీ ప్రెజెంటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. 2008 లో క్యాష్ అండ్ కర్రీ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అమ్మడు సినిమాలేమో కానీ, స్పెషల్ సాంగ్స్ లో అందాల ఆరబోత మాములుగా ఉండదు. ఇప్పటివరకు ఆమె చేసిన సాంగ్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక బాలీవుడ్ భామలు- క్రికెటర్స్ కు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే సోఫియా కూడా రోహిత్ శర్మ ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య డేటింగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక కొన్ని కారణాల వలన వీరు విడిపోయారు.

Advertisement

ఇక ఆ తరువాత సోఫియా.. ఒక వ్యాపారవేత్తను వివాహమాడి విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇక అక్కడ మంచి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది అనుకొనేలోపు విబేధాల వలన ఏడాది కూడా అవ్వకముందే విడాకులు తీసుకొని మళ్లీ కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఒక రెండు మూడు సినిమాల్లో కనిపించిన ఈ చిన్నది ఆ తరువాత సడెన్ గా మాయమయ్యింది.

సడెన్ గా కొన్నిరోజుల తరువాత ఈ చిన్నది సన్యాసినిగా దర్శనమిచ్చింది. ఎప్పుడు బట్టలు తక్కువగా.. అందాలను ఆరబోసే ఈ చిన్నది. నిండా తెలుపు దుస్తులు ధరించి ఆధ్యాత్మికంలో గడుపుతూ కనిపించింది. దీంతో అసలు ఎందుకు ఆమె ఇలా సన్యాసం పుచ్చుకున్నదో అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Advertisement

భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మికంలోనే ఎక్కువ ఆనందం ఉందని తెలుసుకున్నట్లు తెలిపిన సోఫియా ప్రస్తుతం భక్తిమార్గంలోనే సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక అప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా మారింది అని ఆమె ఫొటోస్ ను అభిమానులు నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×