BigTV English

Israel Attack On Gaza: ఇజ్రాయిల్ హింసాత్మక దాడి, 71 మంది మృతి

Israel Attack On Gaza: ఇజ్రాయిల్ హింసాత్మక దాడి, 71 మంది మృతి

Israel Attack On Southern Gaza: ఇజ్రాయిల్ మరోసారి గాజాపై దాడులకు తెగబడింది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ దాడి చేసింది. ఖాన్ యునిస్‌పై చేసిన ఈ దాడి ఘటనలో దాదాపు 71 మంది మృతి చెందగా, 289 మంది గాయపడ్డట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని నాస్సర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.


హమాస్ సైన్యాధాక్షుడే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. మనవతా జోన్‌గా ప్రకటించిన మువాసి పరిధిలో దాడి జరిగినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో లక్షలాది మంది పాలస్తీనియన్లు రక్షణా శిభిరాల్లో తలదాచుకుంటున్నారు. కొంతకాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయిల్ దాడి జరిగిన ప్రాంతం భూకంపం సంభవించినట్లుగా వణికిపోతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించగా శిథిలాల నుంచి పలువురు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాజా దాడిలో ఆ ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణం ఏర్పడింది. మరోవైపు సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ సభ్యులతో సహా 100మంది మరణించారని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఈ రిపోర్టులను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. ఈ దాడిపై హమాస్‌కు చెందిన ఓ అధికారి స్పందిస్తూ ఇది తీవ్రమైన దాడి అని పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేరుకోవడానికి ఇజ్రాయెల్ ఆసక్తిని చూపలేదనే విషయం ఈ దాడితో స్పష్టం అయిందని అన్నారు.


Also Read: హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా.. కారణమిదే !

హమాస్ మిలటరీ చీఫ్ మహమ్మద్ ధీప్ లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపినట్టు వెల్లడించగా.. మహమ్మద్ హత్యకు గురయ్యాడా లేదా అనేది అస్పష్టంగా ఉందని భద్రతా అధికారి తెలిపారు. ఇక గతేడాది అక్టోబరు 7 న ఇజ్రాయిల్ పై హమాస్ దాడిసూత్రధారుల్లో దీఫ్ ఒకరు. అతడు ఇజ్రాయిల్ చేసిన ఏడు హత్యా ప్రయత్నాలను తప్పించుకున్నాడని నివేదికలు చెబుతున్నాయి. దీఫ్ చాలా ఏళ్లుగా ఇజ్రాయిల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ అగ్రస్థానంలో ఉన్నారు.

 

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×