E-Paper
Advertisement

Sharukh khan: ఓటీటీలోకి వచ్చేసిన షారుఖ్ ‘డంకి’.. సడన్ సర్ప్రైజ్ మామూలుగా లేదు..

Sharukh khan: ఓటీటీలోకి వచ్చేసిన షారుఖ్ ‘డంకి’.. సడన్ సర్ప్రైజ్ మామూలుగా లేదు..
Advertisement
Sharukh khan

Sharukh khan (latest bollywood movies):

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గతేడాది పఠాన్, జవాన్ సినిమాలతో ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీసు వద్ద ఈ రెండు సినిమాలు కళ్లు చెదిరే వసూళ్లను కొల్లగొట్టాయి. అయితే మూడో సినిమా ‘డంకీ’ తో షారుఖ్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకున్నాడు. కానీ అనుకున్నంత రేంజ్‌లో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. మరి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేద్దాం..

Advertisement

షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడ్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ ‘డంకి’. గతేడాది ఎన్నో భారీ అంచనాల నడుమ డిసెంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. అయితే అదే సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోవడంతో ‘డంకీ’ మూవీ కనుమరుగు అయింది.

అప్పటి వరకు షారుఖ్‌ను మాస్ లుక్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో చూసిన ప్రేక్షకులు డంకీ మూవీలో క్లాస్ లుక్‌లో షారుఖ్ చూసేందుకు ఇష్టపెట్టుకోలేదు. అంతేకాకుండా కంటెంట్ పరంగా కూడా కాస్త దెబ్బపడింది. దీంతో ఈ మూవీ అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా.. ఈ సినిమా లాంగ్ రన్‌లో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ.460 కోట్లకి పైగా వసూళ్లు చేసి అబ్బురపరచింది.

Advertisement

READ MORE: ఎమోషనల్ టచ్ .. డంకీ మూవీ ఎలా ఉందంటే..?

ఈ మూవీలో షారుఖ్‌కి జోడీగా తాప్సీ నటించగా.. విక్కీ కౌశల్ కీ రోల్‌లో అదరగొట్టేశాడు. ఇక ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ తర్వాత ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో అలా ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కు సడెన్ సర్ప్రైజ్ అందింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నిన్నటి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో నిన్న ఉదయం నుంచే సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే కేవలం హిందీలో మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ సినిమాని అప్పుడు థీయేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×