BigTV English

Nepal : నేపాల్‌కు తిరిగొస్తున్న దేవుళ్లు!

Nepal : నేపాల్‌కు తిరిగొస్తున్న దేవుళ్లు!

Nepal Gods Return From Exile : నేపాల్ దేవుళ్లు తిరిగి స్వదేశానికి చేరనున్నారు. ఆ దేశం నుంచి గతంలో హిందువుల పవిత్ర దేవతామూర్తుల విగ్రహాలు లెక్కకు మిక్కిలిగా చోరీకి గురయ్యాయి. పురాతనమైన ఆ విగ్రహాలను దేశదేశాలకు స్మగుల్ చేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడా వారసత్వ సంపద హిమాలయన్ దేశానికి తిరిగి చేరుతోంది.


అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలతో ఎంతో విలువైన అలాంటి వస్తువులన్నింటినీ తిరిగి మాతృదేశాలకు అప్పగిస్తున్నారు. గత నెలలో అమెరికా నుంచి నాలుగు విగ్రహాలు వెనక్కి వచ్చాయి. 16వ శతాబ్దం నాటి శివపార్వతుల అవతారమైన ఉమా-మహేశ్వర విగ్రహం వాటిలో ఒకటి. 40 ఏళ్ల క్రితం అది చోరీ అయింది.

Read more : పన్ను చెల్లిస్తేనే బాలిలోకి ఎంట్రీ..


చేతులు మారుతూ చివరకు అది న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ మ్యూజియానికి చేరింది. ఎట్టకేలకు అది నేపాల్‌లోని పాఠన్‌కు చేరడంతో భక్తులు పెద్ద ఎత్తున పండగ చేసుకున్నారు. భవిష్యత్తులో మరో 20 కళారూపాలు నేపాల్‌ చేతులకు తిరిగి అందనున్నాయి. వీటిలో అధికభాగం అమెరికా, యూరప్ దేశాల నుంచే వస్తున్నాయి. తిరిగొచ్చిన దేవుళ్లను సందర్శించే అవకాశం భక్తులకు కల్పిస్తోంది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం 62 విగ్రహాలు తిరిగి వెనక్కి వచ్చాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×