E-Paper
Advertisement

Exclusive: బోయపాటి- బాలకృష్ణ విధ్వంసం..అఖండ 2 మొదలయ్యేది ఎప్పుడంటే.. ?

Exclusive: బోయపాటి- బాలకృష్ణ విధ్వంసం..అఖండ 2 మొదలయ్యేది ఎప్పుడంటే.. ?
Advertisement

Exclusive: కరోనా సమయంలో సినీ ఇండస్ట్రీ ఎలాంటి కష్టాలను ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో థియేటర్లు మూత పడ్డాయి. ఆ నష్టాలను భర్తీ చేయడానికి ప్రముఖులు ఏం చేయాలా అని తలలు పట్టుకున్నారు. స్టార్ హీరోల సినిమాలు  థియేటర్ లో వచ్చినా ప్రేక్షకులు చూడలేని పరిస్థితి. ఆ సమయంలోనే  వచ్చింది ఒక సినిమా.

కథ నచ్చితే ప్రేక్షుకులు ఆదరిస్తారని, ఎలాంటి పరిస్థితులు వారిని ఆపలేవని రుజువు చేసింది. కథ నచ్చితే తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. లాక్ డౌన్ తరువాత రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలుకొట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈపాటికే  ఆ సినిమా ఏంటి అనేది మీకు అర్దమైపోయి ఉంటుంది. అవును.. అదే అఖండ.

Advertisement

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను  కాంబోలో వచ్చిన మూడోవ సినిమా. అసలు అప్పట్లో ఈ సినిమాకు థియేటర్ లో ఫ్యాన్స్ చేసిన రచ్చను మర్చిపోవడం సాధ్యం కాదేమో. బాలయ్య యాక్టింగ్.. బోయపాటి మేకింగ్ ఒక ఎత్తు అయితే థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ మ్యూజిక్  కు కొన్ని థియేటర్ లో సౌండ్ బాక్సులు బద్దలయ్యాయి అంటే అతిశయోక్తి లేదు.

ఇక  వీరి కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. సింహా, లెజెండ్, అఖండ.. వీరి సినిమా అంటే  అది రికార్డులు బద్దలుకొట్టడమే అని చెప్పాలి. అదేంటో కానీ.. మిగతా హీరోలకు కథలు రాయమంటే బోయపాటి తడబడుతున్నాడు కానీ, అదే బాలయ్యకు కథ అంటే మాత్రం.. బాబు రెడీనా బాబు అంటూ ఊగిపోతాడు.

Advertisement

అఖండ తరువాత బోయపాటికి స్కంద సినిమాతో పెద్ద ఎదురుదెబ్బనే తగిలింది. ఇక దాని నుంచి బయటపడాలంటే.. మళ్లీ బాలయ్యతో సినిమా చేయాల్సిందే. ఇప్పుడు అదే చేస్తున్నాడు బోయపాటి. వీరిద్దరి కాంబోలో అఖండ 2 రానుంది. అఖండ కు సీక్వెల్ ఉంటుందని.. మొదటి నుంచి హింట్ ఇస్తూనే ఉన్నారు.  అఖండ 2 గురించి ఎప్పుడు బోయపాటిని అడిగినా త్వరలోనే అనే సమాధానం వినిపిస్తూ వస్తుంది.

తాజాగా ఆ క్షణం రానే వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. అఖండ 2 సెట్ మీదకు వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈ నెల 16 న అఖండ 2 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను మేకర్స్ ఎంతో గ్రాండ్ గా చేయనున్నారట. దీంతో అఖండ ఫ్యాన్స్.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం బాలయ్య.. NBK109 సినిమాతో బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్  జరుపుకుంటుంది. దీంతో పాటే అఖండ 2 షూటింగ్ లో కూడా పాల్గొంటాడని టాక్. మరి మూడు  సినిమాలతో హిట్ కొట్టిన ఈ కాంబో.. నాలుగవ సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×