BigTV English

Temple In Pitapuram: పవన్ నియోజకవర్గంలో ఇదేమిటి ? మరీ ఇంత నిర్లక్ష్యమా.. ఇకనైనా మారేనా ?

Temple In Pitapuram: పవన్ నియోజకవర్గంలో ఇదేమిటి ? మరీ ఇంత నిర్లక్ష్యమా.. ఇకనైనా మారేనా ?

Temple In Pitapuram: ఆ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నది సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటువంటి నియోజకవర్గంలో గల ఓ ఆలయం.. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిందంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిత్యం శునకాలు ఈ అలయంలోకి ప్రవేశించి, గందరగోళం చేస్తున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు.


పిఠాపురంలో దక్షిణ కాశీగా భావించే పవిత్ర పాదగయ ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయానికి నిత్యం భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఆలయంలో వెలసిన శివలింగానికి పూజలు నిర్వహిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ పవిత్ర కొలనులో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని చరిత్ర. అంతటి పవిత్రమైన ఆలయం నేడు అధ్వాన్నస్థితికి చేరుకుంది. ఆలయంలో ఎటు చూసినా.. చెత్త, చెదారం, మురికి కనిపిస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవిత్ర కొలనులో ఉన్న జలం రంగు కూడా పూర్తిగా మారిందని, భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు కూడా వీలు లేకుండా ఉందని జై హనుమాన్ సేవా సమితి కాకినాడ జిల్లా అద్యక్షుడు సురేంద్ర దత్త తెలిపారు.

ఇంకా ఈ ఆలయ పరిస్థితి గురించి సురేంద్ర దత్త మాట్లాడుతూ.. కాకినాడ జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడే ఆలయంగా పవిత్ర పాదగయ ఆలయంకు ఘనచరిత్ర ఉందన్నారు. పూజల నిమిత్తం వచ్చిన భక్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావన్నారు. ఆలయంలో ఎటు చూసినా మురికి ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ ఆలయం పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నట్లు విమర్శించారు. ఈ ఆలయంలో పూజలందుకునే స్వామి వారి పరిసరాల్లోకి నిత్యం శునకాలు ప్రవేశిస్తున్నాయని, అయినా కూడా అధికారులు పట్టించుకోని స్థితి ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆలయం అధ్వాన్నస్థితికి చేరుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం ఆలయాల పరిరక్షణకు అన్నీ చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. ఈ ఆలయం పరిస్థితి ప్రభుత్వం దృష్టికి వెళ్లలేదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తరపున సంబంధిత అధికారులకు పవన్ ఆదేశాలిచ్చి.. ఆలయం అభివృద్ది పథం వైపు నడిచేలా చూడాలని, అలాగే నిర్లక్ష్య వైఖరిలో ఉన్న సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Also Read: Nara Lokesh: రెడ్ బుక్ ఓపెన్ చేశా.. ఎవ్వరినీ వదిలిపెట్టను.. పరదాల పాలన అనుకుంటున్నారా.. లోకేష్ కామెంట్స్

దసరా శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్..
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలను పవన్ తెలిపారు. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి ప్రజలందరికీ విజయం చేకూర్చాలని, తెలుగు రాష్ట్రాలపై శక్తి స్వరూపిణి దీవెనలు ఉండాలని ప్రార్థిస్తునన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×