BigTV English

Boycott Sitaare Zameen Par: ఆమీర్ కొత్త సినిమాపై హిందువులు ఆగ్రహం… ‘వాడిని బాయ్‌కాట్ చేయాలి’ అంటూ

Boycott Sitaare Zameen Par: ఆమీర్ కొత్త సినిమాపై హిందువులు ఆగ్రహం… ‘వాడిని బాయ్‌కాట్ చేయాలి’ అంటూ

Boycott Sitaare Zameen Par: మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మౌనం.. ఇప్పుడు అతని సినిమాకే శాపంగా మారిందా అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  కొంతకాలంగా ఆమీర్ కు సరైన విజయం దక్కడం లేదు. నిర్మాతగా, హీరోగా కూడా ఆమీర్ సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. ఇక ఈసారి ఎలాగైనా కూడా మంచి సక్సెస్ ను అందుకోవాలని.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా సితార్ జమీన్ పర్ సినిమాను నిర్మించాడు. RS ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 20 న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది.


 

అయితే మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్నా కూడా కలక్షన్స్ మాత్రం దారుణంగా అందుకుంది. అసలు ఆమీర్ సినిమాకు ఇలాంటి కలక్షన్స్ ఏంటి అని అభిమానులు నోర్లు నొక్కుకుంటున్నారు.  ఈ చిత్రం మొదటి రోజు 11.5 కోట్ల వ్యాపారం చేసింది. సితార్ జమీన్ పర్ సినిమా ఆమిర్ చివరి సినిమా లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ కలెక్షన్‌ను బద్దలు కొట్టలేకపోయింది. 2022 సంవత్సరంలో లాల్ సింగ్ చద్దా సినిమా 11.7 కోట్ల బిజినెస్ చేసింది.ఇక ఇప్పుడు సితార్.. దాన్ని కూడా దాటలేకపోయింది.


 

ఇక సినిమాకు రిలీజ్ కు మూడు వారాల నుంచే బాయ్ కాట్ సితార్ జమీన్ పర్  వార్తలు హీటెక్కించిన విషయం తెల్సిందే. అందుకు మూడు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమీర్ మౌనం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. ఆమీర్ కు దేశ భక్తి లేదని, అలాంటి వాడు తీసిన సినిమాను హిందువులు ఎందుకు చూడాలని మండిపడుతున్నారు. అంతలా ఆమీర్ ఏం చేశాడు అంటే.. హిందువులపై జరిగిన దాడిపై అతను స్పందించకపోవడమే.

 

ఈ మధ్యనే ఇండియాను మొత్తం షేక్ చేసిన ఘటన ఆపరేషన్ సిందూర్. ఈ ఘటన ఇండియన్స్ ను ముఖ్యంగా హిందువులను ఎంత క్షోభకు గురిచేసిందో అందరికీ తెల్సిందే.  ఈ ఘటనపై ప్రతి ఒక్కరు స్పందించారు. ఒక్క ఆమీర్ తప్ప. అంటే ఆయన ప్రొడక్షన్ హౌస్ స్పందించినా.. అప్పటికే లేట్ అయ్యిపోయింది. ఆపరేషన్ సిందూర్ తరువాత.. టెర్రరిస్టులను భారత సైనికులు కాల్పులు జరిపి వారి అంతు చూసింది. ఆ తర్వాత, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ భారత సైనికుల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తూ  వారికి సంఘీభావం తెలుపుతూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. కానీ, అది చేసింది ఆమీర్ టీమ్..అసలు ఆమీర్ ఈ విషయమై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక ఇది హిందువులను అవమానించడమే అని వారు మండిపడుతున్నారు.

 

ఇది కాకుండా గతంలో ఆమీర్ చేసిన ఒక పనిని కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. గతంలో ఆమీర్ ఒక రష్యన్ అమ్మాయికి సపోర్ట్ గా నిలబడ్డాడు. మొదటి నుంచి కూడా అతను జాతి వ్యతిరేకతకు సపోర్ట్ చేస్తున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇది కాకుండా ఇంకొక కారణం.. సితార్ జమీన్ పర్  ఒక రీమేక్. స్పానిష్ లో తెరకెక్కిన ఛాంపియన్స్ సినిమాకు రీమేక్ గా. ఈ సినిమాను తెరెకెక్కించాడు. ఇప్పుడు రీమేక్ లు చూసే ఓపిక మాకు లేదని. ఈ సినిమాకు వెళ్లడం కన్నా ఆ టికెట్ డబ్బులను పేదవాళ్లకు ఇస్తే బావుంటుందని కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు. అలా సితార్ జమీన్ పర్ బాయ్ కాట్ కు గురైంది. మరి ఈ వివాదాలపై ఆమీర్ స్పందిస్తాడేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×