BigTV English

Case On Singer Chinmayi : సింగర్ చిన్మయిపై కేసు.. దేశంపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్..

Case On Singer Chinmayi : సింగర్ చిన్మయిపై కేసు.. దేశంపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్..

Case On Singer Chinmayi


Case On Singer Chinmayi :హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో గాయని చిన్మయిశ్రీపాదపై కేసు నమోదైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్టూడెంట్ కుమార్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దేశంపై ఆమె తప్పుడు వ్యాఖ్యలు చేశారని సదరు విద్యార్థి ఫిర్యాదులో పేర్కొన్నారు.

సినీ నటి అన్నపూర్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆ రోజుల్లో మహిళలు బయటకు వచ్చేవాళ్లా? అని అన్నారు. మహిళలకు స్వాతంత్య్రం ఎందుకు కావాలని ప్రశ్నించారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత స్త్రీలకు బయట ఏం పని ఉంటుందని నిలదీశారు. ప్రస్తుత కాలంలో ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువైపోయిందని మండిపడ్డారు. మనల్ని ఎవరూ ఏమీ అనకూడదు మనమాత్రం ఎదుటవారిని ఏదో ఒకటి అనేందుకు సిద్ధంగా ఉంటాం అంటూ అన్నపూర్ణ విమర్శించారు. నిత్యం ఎదుటివాళ్లదే తప్పు అని మాట్లాడకూడదని.. మనవైపు తప్పులు ఉంటాయని తెలుసుకోవాలని ఆ ఇంటర్వ్యూలో ఈ సీనియర్ నటి వ్యాఖ్యానించారు.


అన్నపూర్ణ వ్యాఖ్యలంపై గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో తీవ్రస్థాయి మండిపడ్డారు. ఈ దేశంలో పుట్టడం తన కర్మ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు. భారత్ ను స్టుపిడ్ కంట్రీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read More: ఒక్క సీన్ కోసం రూ.50 కోట్లు.. పుష్పగాడి రూల్ మామూలుగా లేదు..!

చిన్మయి వ్యాఖ్యలపై హెచ్సీయూ స్టూడెంట్ కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా చిన్మయి భారత్ ను కించపరిచే విధంగా మాట్లాడటం తగదన్నారు. సింగర్ చిన్మయిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆమెపై గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు చిన్మయిపై కేసు నమోదు చేశారు.

 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×