BigTV English

Pushpa 2: ఒక్క సీన్ కోసం రూ.50 కోట్లు.. పుష్పగాడి రూల్ మామూలుగా లేదు..!

Pushpa 2: ఒక్క సీన్ కోసం రూ.50 కోట్లు.. పుష్పగాడి రూల్ మామూలుగా లేదు..!


Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘పుష్ప2’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీపై అందరిలోనూ భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌కు దేశవ్యాప్తంగా ఊహించని రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌ని గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక పుష్ప2 మూవీకి సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకాభిమానుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఎంతో ప్రతిష్టాతకంగా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా మరొక వార్త బయటకొచ్చి ఐకాన్ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. పుష్ప2 మూవీకి సంబంధించి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది. ఇందులోని ఒక్క సీన్ కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

READ MORE: పుష్ప 2 క్రేజీ అప్డేట్.. ఆ ఒక్క సీన్ కి పూనకాలే..

అయితే అది జతర సీన్ అని సమాచారం. పుష్ప 2లో ఈ జాతర సీన్ కోసం దాదాపు రూ.50 కోట్ల మేర ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సీన్ సినిమాకే హైలెట్ ఉంటుందని సమాచారం. ఈ సీన్‌లో ఐకాన్ స్టార్ అర్ధనారీశ్వరుడిగా కనిపిస్తాడని గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఈ సీన్‌లో ఓ భారీ యాక్షన్ ఫైట్‌తో పాటు ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో బన్నీ అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది. దీంతో ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు వారు సోషల్ మీడియా ద్వారా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే 2021లో విడుదలైన ‘పుష్ప’కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ లభించింది. అంతేకాకుండా ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా ఈ మూవీ తరపుర ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డును సైతం అందుకుని.. మరే నటుడికి దక్కని అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

READ MORE: పుష్ప 2 స్టోరీ ఇదేనా? పులికే బెదురు.. ఇక, షెకావత్‌కు? తగ్గేదేలే..

ఇక ఆ ఫస్ట్ పార్ట్‌కు ఇంతటి రెస్పాన్స్ రావడంతోనే దర్శకుడు సుకుమార్ ఈ మూవీ సెకండ్ పార్ట్ ‘పుష్ప 2’ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఇందులో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయతో పాటు మరికొంతమంది స్టార్ నటీనటులను ఈ సెకండ్ పార్ట్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×