Big Stories

Chiranjeevi Sreeja: కుమార్తెకు కోట్ల రూపాయ‌లు విలువైన గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్‌

Chiranjeevi Sreeja: సామాన్యులు ఏం చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు కానీ.. సెల‌బ్రిటీలు చేసే చిన్న పనైనా హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు చిరంజీవి విష‌యంలోనూ అదే జరిగింది. చిరంజీవి కొన్ని కోట్లు రూపాయ‌లు ఖ‌ర్చు పెడితే సామాన్య‌మైన విష‌యం అని అంటారేంటి? అనుకోవ‌ద్దు. ఎందుకంటే.. మ‌న‌కు అది పెద్ద విష‌య‌మే కానీ.. ఆయ‌న‌కైతే మాత్రం కాదు. ఇంత‌కీ చిరంజీవి కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు ఎందుకు పెట్టార‌ని అనుకుంటున్నారా? త‌న చిన్న కుమార్తె శ్రీజ కోసం. నెట్టింట వైర‌ల్ అవుతున్న స‌మాచారం మేర‌కు.. ఇటీవ‌ల చిరంజీవి ఎం.ఎల్‌.ఎ కాల‌నీలో రూ.35 కోట్ల ఇంటిని కొనుగోలు చేసిన దాన్ని త‌న చిన్న కుమార్తెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఓ క‌న్వెన్ష‌న్ అధినేత ఆ ఇంటిని అమ్మేస్తుంటే విష‌యం తెలుసుకున్న చిరంజీవి ఆ డీల్‌ను పూర్తి చేశార‌ట‌. త‌ను చేస్తున్న వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ సినిమాల‌కు సంబంధించిన పారితోష‌కాల‌తోనే ఆ ఇంటిని ఆయ‌న కొన్నార‌ని టాక్‌.

- Advertisement -

రీసెంట్‌గానే త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ మంచి పోజిష‌న్స్‌లో ఉన్నార‌ని వ్య‌క్తిగా త‌న‌కు అంత‌కంటే ఆనందం మ‌రోటి లేద‌ని, నేను కోరుకున్న దానికంటే ఎక్కువ‌గానే దేవుడు ఇచ్చాడని చిరంజీవి మీడియాతో అన్నారు. ఇక‌పై సామాజిక సేవ‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన దాని కంటే ఎక్కువ‌గా సోసైటీకి తాను తిరిగి ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని ఆయ‌న చెప్పిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News