E-Paper
Advertisement

Chiranjeevi: కేరళ సీఎంను కలిసి విరాళం అందజేసిన మెగాస్టార్

Chiranjeevi: కేరళ సీఎంను కలిసి విరాళం అందజేసిన మెగాస్టార్
Advertisement

Chiranjeevi: కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలు ఎంత విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షాల వలన కొండచరియలు విరిగి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరెంతోమంది గాయాలపాలయ్యారు. ఇంకెంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు ప్రభుత్వానికి అండగా నిలబడుతుంది.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు.. కేరళ ప్రభుత్వానికి విరాళాలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే. వయనాడ్ బాధితుల సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తాను, రామ్ చరణ్ కలిసి రూ. కోటి రూపాయలు అందిస్తున్నట్లు చిరు ప్రకటించిన విషయం తెల్సిందే.

Advertisement

తాజాగా నేడు మెగాస్టార్ స్వయంగా కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి.. కోటి రూపాయల చెక్ ను అందజేశారు. వయనాడ్ విధ్వంసం గురించి కొద్దిసేపు సీఎంతో చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరుతో పాటు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, రష్మిక లాంటి హీరోలు విరాళాలు అందించగా.. కోలీవుడ్ నుంచి సూర్య, విక్రమ్, కమల్ హాసన్ తదితరులు విరాళాలు అందించారు.

ఇక చిరంజీవి కెరీర్ విషయానికొస్తే … ప్రస్తుతం చిరు, విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×