BigTV English

Wayanad landslides: మీ సేవలు మరిచిపోలేము.. వయనాడ్‌లో జవాన్‌లకు కన్నీటి వీడ్కోలు

Wayanad landslides: మీ సేవలు మరిచిపోలేము.. వయనాడ్‌లో జవాన్‌లకు కన్నీటి వీడ్కోలు

Wayanad landslides: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు కూలిన ఘటనలో 400 మందికి పైగా మరణించారు. ఇంకా 152 మంది ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. ఇక ఈ విపత్తు చోటు చేసుకున్న రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు భారత సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంది. నేటితో వారి సహాయక చర్యలు ముగియడంతో వారికి వయనాడ్ ప్రజలు వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వయనాడ్‌లో ప్రకృతి విపత్తు జరిగిన రోజు నుంచి ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి శిథిలాల్లో చిక్కుకున్న  చాలా మందిని రక్షించారు. అంతే కాకుండా చనిపోయిన వారి మృత దేహాలు కూడా బయటకు తీసారు. సాహసోపేతంగా వారు బాధితులను రక్షించిన తీరు అందరి మదిలో నిలిచిపోయింది. అంతే కాకుండా తక్కువ సమయంలోనే వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలను కూడా అందుకున్నారు. వయనాడ్ ప్రజలకు కూడా వీరు ఎంతో సేవ చేశారు.

Also Read: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ


ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా సరే ఓడ్చి బాధితులకు బాసటగా నిలిచారు. ఇదిలా ఉంటే నేటితో వారి సహాయక చర్యలు ముగియడంతో జవాన్లు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఈ సందర్భంగా జవాన్లు వీడ్కోలు పలుకుతూ వయనాడ్ ప్రజలు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. జవాన్లు తిరిగి వెళుతుండగా అక్కడికి వచ్చిన వారంతా ఉద్వేగానికి గురయ్యారు. తమకు ఎంతగానో సాయం చేశారు అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×