E-Paper
Advertisement

Waltair Veerayya Title Song: మెగాస్టార్‌కి ప‌ర్ఫెక్ట్ టైటిల్ సాంగ్ వీర‌య్య‌.. అదుర్స్ అంతే!

Waltair Veerayya Title Song: మెగాస్టార్‌కి ప‌ర్ఫెక్ట్ టైటిల్ సాంగ్ వీర‌య్య‌.. అదుర్స్ అంతే!
Advertisement

Waltair Veerayya Title Song: భ‌గ‌భ‌గ‌భ‌గ భ‌గ భ‌గ భ‌గ భ‌గ భ‌గమండే మ‌గ మ‌గ మ‌గ మ‌గ మ‌గ‌మగ మ‌గాడురా వీడే జ‌గ జ‌గ జ‌గ జ‌గ జ‌గ జ‌గ జ‌గాన్ని చెండాడే ధ‌గ ధ‌గ ధ‌గ ధ‌గ ధ‌గ ధ‌గ జ్వ‌లించు సూరీడే అంటూ సాగుతుంది వాల్తేరు వీర‌య్య టైటిల్ సాంగ్‌. ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. అత్తారింటికి దారేదిలో ఆర‌డుగుల బుల్లెట్టు పాట ప‌వ‌న్‌కల్యాణ్‌కి పడ్డ‌ప్పుడు, ఇలాంటి పాట చిరంజీవికి ఉంటే బావుంటుందే అని చాలా మంది మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. ఒక ఫ్యాన్‌గా అలాంటి పాట‌నే రాయించుకున్నారు కె.ఎస్‌.ర‌వీంద్ర‌. మెగా ఫ్యాన్‌గా మెగాస్టార్‌ని ఎలా చూడాల‌నుకుంటున్నానో, అలాగే సినిమా చేశాన‌ని ఇప్ప‌టికే చెప్పారు ర‌వీంద్ర‌. ఈ పాట‌ను జాగ్ర‌త్త‌గా వింటే సినిమాలో మెగాస్టార్ కేర‌క్ట‌ర్ మీద ఓ అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంది. వీర‌య్య‌కు స‌ముద్రంతో ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థ‌మ‌వుతుంది.

జ‌న‌వ‌రి 13న విడుద‌ల కానుంది వాల్తేరు వీర‌య్య‌. ఇప్ప‌టిదాకా విడుద‌లైన పాట‌లు ఒక ఎత్తు. ఈ పాట మ‌రో రేంజ్ అన్న‌ట్టుగా ఉంది. మెగా ఫ్యాన్స్ మాత్రం వాల్తేరు వీర‌య్య పాట‌తో సంద‌డి చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌మ‌కు సిస‌లైన పండ‌గ గిఫ్ట్ ఇచ్చింద‌ని భావిస్తున్నారు. మెగాస్టార్ ప‌క్క‌న శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది వాల్తేరు వీర‌య్య‌లో. ఇందులో ర‌వితేజ‌, కేథ‌రిన్ కీలక పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. వాల్తేరు వీర‌య్య టైటిల్ సాంగ్‌ను దేవిశ్రీప్ర‌సాద్ బ్రాస్ ఆర్క‌స్ట్రా సెక్ష‌న్‌తో బ్యాంకాక్‌లో ఈ పాట‌ను రికార్డింగ్ చేశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి గొంతులో పాట మ‌రో రేంజ్‌లో వినిపిస్తోంది.

Advertisement

ఆర్థ‌ర్ ఎ విల్స‌న్ ఈ సినిమాకు కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ఎ.ఎస్‌.ప్ర‌కాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌. నిరంజ‌న్ దేవ‌ర‌మ‌నే ఎడిటింగ్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. బాబీ డైలాగులు రాశారు. కోన వెంక‌ట్‌, కె.చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే రాశారు. హ‌రి మోహ‌న‌కృష్ణ‌, వినీత్ పొట్లూరి కూడా రైటింగ్ డిపార్ట్ మెంట్‌లో ఉన్నారు. న‌వీన్ ఎర్నేని, వై ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు. జీకే మోహ‌న్‌, ప్ర‌వీణ్ ఎం స‌హ నిర్మాత‌లు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×