E-Paper
Advertisement

Megastar Chiranjeevi : చిరంజీవి చేతికి గాయం.. ‘విశ్వంభర ‘ షూటింగ్ కు బ్రేక్..?

Megastar Chiranjeevi : చిరంజీవి చేతికి గాయం.. ‘విశ్వంభర ‘ షూటింగ్ కు బ్రేక్..?
Advertisement

Megastar Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటి ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అయితే వయసుకు మించి రిస్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయం అయినట్లు తెలుస్తుంది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్ సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో శనివారం విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి చనిపోయారు. ఆయన పరామర్శించేందుకు త్రివిక్రమ్, చిరంజీవి కలిసి వెళ్లారు. చిరు కారులో నుంచి కిందకి దిగుతుండగా.. ఆయన ఎడమ చేతికి గాయం అయినట్లు తెలుస్తుంది. చిరు వీడియో వైరల్ అవ్వడంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో తన ఎడమ చేయికి గాయం అవ్వడంతో చిరు చేతికి బ్యాండేజ్ వాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ గాయం ఎక్కడ? ఎలా? జరిగిందని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ విషయం పై చిరంజీవి లేదా విశ్వంభర టీమ్ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే గాయం గురించి ఇంతవరుకు ఎవరూ చెప్పకపోవటం గమనార్హం. ఇటీవల చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దుబాయ్‌లో జరిగిన ఐఫా వేడుకకు కుటుంబ సభ్యులతో సహా కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన చేతికి ఎటువంటి గాయం లేదు.. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విశ్వంభర షూటింగ్‌లో మెగాస్టార్ పాల్గొన్నట్లు సమాచారం..

Advertisement

షూటింగ్ స్పాట్ లోనే ఏదైన స్టంట్ చేసినప్పుడు గాయం అయ్యి ఉంటుందని తెలుస్తుంది. ఏదీమైనా చిరంజీవి జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది. సినిమా అనుకున్న టైమ్‌కు రావటం కోసమే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోందని ఇండస్ట్రీలో టాక్. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ మూవీలో చిరు సరసన త్రిష కథనాయికగా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్‌ను చిత్రయూనిట్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×