BigTV English

Wife and Husband: మీ జీవిత భాగస్వామి మీకు అబద్ధం చెబుతున్నా, మోసం చేస్తున్నా తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ టిప్స్ పాటించండి

Wife and Husband: మీ జీవిత భాగస్వామి మీకు అబద్ధం చెబుతున్నా, మోసం చేస్తున్నా తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ టిప్స్ పాటించండి
Wife and Husband: ఏ సంబంధానికైనా పునాది… నిజాయితీ, నమ్మకం. కానీ కొంతమంది జీవిత భాగస్వాములు అబద్ధాలు చెబుతూ తమ బంధాన్ని బలహీనపరుచుకుంటూ ఉంటారు.  లైఫ్ పార్టనర్‌కు అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ ఉంటే ఆ విషయాన్ని కనిపెట్టడం చాలా సులువు. మీ జీవిత భాగస్వామి మీతో నిజాయితీగా ఉంటున్నారో లేదో అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని పాటించండి.
నేరుగా చూడలేరు 
మీ భాగస్వామి అబద్ధం చెప్పేటప్పుడు మీ కంటి వైపు నేరుగా చూడలేరు. అసౌకర్యంగా మాట్లాడుతూ ఉంటారు. గోడవైపు, నేలవైపు చూస్తూ ఉంటారు. లేదా టీవీ చూస్తున్నట్లు నటిస్తారు. ఏదైనా విషయాన్ని మీ కళ్ళల్లోకి నేరుగా చూసి చెప్పకుండా బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉంటే అతను ఏదో అబద్దాన్ని చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి.
త్వరగా విసుక్కోవడం 
ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు మీరు తిరిగి వారిని ప్రశ్నిస్తే అతనికి త్వరగా విసుగు, కోపం వచ్చేస్తాయి. మీరు రెచ్చగొట్టకుండానే అతను కోప్పడి ఆ సందర్భం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అబద్దాలకోరులంతా అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవడానికి చూస్తారు.
చెమట పట్టడం 
మీరు ఏదైనా విషయం అడిగినప్పుడు మీ భాగస్వామికి చెమటలు పడుతున్నా లేదా ఒక రకమైన భయాందోళనలతో కనిపిస్తున్నా, అసౌకర్యంగా అనిపిస్తున్నా అతను అబద్ధం చెబుతున్నాడని లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. మీకు తెలియకుండా ఏదో ఒక విషయాన్ని దాచి ఉంచాడని అర్థం.
గ్యాప్ తీసుకుంటూ మాట్లాడడం 
నిజం చెప్పడానికి నిమిషం కూడా ఆగాల్సిన అవసరం లేదు, కానీ అబద్ధాలు చెప్పాలంటే, అబద్ధపు కథలు అల్లాలంటే మాట్లాడేటప్పుడు గ్యాప్ లు అధికంగా వస్తాయి. వారు సాధారణ శైలిలో మాట్లాడకుండా మాట్లాడే విధానం మార్చినా, మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో విరామాలు అధికంగా తీసుకుంటున్నా వారిని అనుమానించాల్సిందే.
సాకులు చెప్పడం 
మీరు వారి ప్రవర్తనను ప్రశ్నిస్తున్నా, వారి పనులను పరిశీలిస్తున్నా మీ నుంచి వారు దూరం అవడానికి ప్రయత్నిస్తారు. కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి లేనిపోని సాకులు చెబుతారు.  ఫోన్ మాట్లాడుతూ అక్కడ్నించి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. అత్యవసరమైన పని ఉందని వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతారు. ఇలాంటి లక్షణాలు మీ జీవిత భాగస్వామిలో కనిపిస్తే అతని ప్రవర్తనను  అనుమానించాల్సిందే. అతడితో కూల్ గా కూర్చుని ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాల్సిందే. లేకుంటే తెగేదాకా వ్యవహారం సాగే అవకాశం ఉంది.


Related News

Flax Seeds: మహిళలు ఫ్లాక్ సీడ్స్ తింటే. ?

Tips For Long Hair: జుట్టు తొందరగా పెరగాలంటే ?

Shrunken Heads: తలలు నరికి, పుర్రెపై చర్మాన్ని ఒలిచి.. చనిపోయేవాళ్లను ఇక్కడ ఇలాగే చేస్తారు, ఎందుకంటే?

Weight Loss: బరువు తగ్గాలా ? అయితే రాత్రిపూట ఇవి అస్సలు తినొద్దు !

Kidney Health: వీటికి దూరంగా ఉంటేనే.. మీ కిడ్నీలు సేఫ్

Fatty Liver Disease: మహిళలకు ఫ్యాటీ లివర్ ముప్పు.. ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు

Big Stories

×