E-Paper
Advertisement

Vikram – Thangalaan: పుష్ప2 రిలీజ్ డేట్ వాయిదా.. అదే డేట్ లాక్ చేసుకున్న విక్రమ్ తంగలాన్.. కొత్త పోస్టర్ రిలీజ్

Vikram – Thangalaan: పుష్ప2 రిలీజ్ డేట్ వాయిదా.. అదే డేట్ లాక్ చేసుకున్న విక్రమ్ తంగలాన్.. కొత్త పోస్టర్ రిలీజ్
Advertisement

Vikram Thangalaan Movie Release Date(Cinema news in telugu): కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో చిత్రాలు తెలుగులో చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. అంతేకాకుండా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. కాగా విక్రమ్ ఇప్పుడు పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. అందులో పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ చేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విక్రమ్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. జియో స్టూడియోస్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందుకు విక్రమ్ డిఫరెంట్ లుక్సే కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో విక్రమ్ ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు.

Advertisement

ఈ చిత్రాన్ని కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో నివాసుల కథగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మాళవిక మోహనన్, పార్వతి, పశుపతి, హరికృష్ణ, డేనియల్ కాల్టిగన్‌రోన్ వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ సినీ ప్రియులు, అభిమానుల్లో ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా టీజర్ గ్లింప్స్‌లో విక్రమ్ లుక్‌కి ఫిదా అయిపోయారు.

Also Read: అఘోరాలా దర్శనమిచ్చిన చియాన్ విక్రమ్.. ఆకట్టుకుంటున్న తంగ‌ల‌న్‌ ఫస్ట్ లుక్..

Advertisement

దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయాలని ప్రకటించారు. కానీ రిలీజ్‌కు దగ్గర్లో ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వత కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఈ చిత్రాన్ని సమ్మర్‌ హాలీడేస్ సందర్భంగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆ రిలీజ్ డేట్‌ను కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మరొక కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సారి ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఇప్పుడు విక్రమ్ తంగలాన్ సినిమాను ఆ డేట్‌న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×