E-Paper
Advertisement

RamCharan: రామ్‌చరణ్ హాలీవుడ్ మూవీ.. ఆమెనే హీరోయిన్!.. క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్..

RamCharan: రామ్‌చరణ్ హాలీవుడ్ మూవీ.. ఆమెనే హీరోయిన్!.. క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్..
Advertisement

RamCharan: హాలీవుడ్‌లో RRR క్రేజ్ మొదలైనప్పటి నుంచీ ఒకటే టాక్. త్వరలోనే రాజమౌళి, తారక్, చరణ్‌లు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాజమౌళిని కామెరూన్, స్పిల్‌బర్గ్ లాంటి దిగ్గజాలు ప్రశంసించడంతో.. జక్కన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు నిర్మాణ సంస్థలూ.. రాజమౌళిని సంప్రదించాయి. నేరుగా హాలీవుడ్ సినిమా కాకుండా.. అక్కడి కొలాబరేషన్‌తో త్వరలోనే ఓ మూవీ చేయబోతున్నట్టు, ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్టు.. రాజమౌళినే స్వయంగా ప్రకటించారు.

ఇక, తారక్, రామ్ చరణ్ ల హాలీవుడ్ ఎంట్రీపైనా పలు రకాల వార్తలు వచ్చాయి. లేటెస్ట్‌గా, ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు రామ్‌చరణ్. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న చరణ్.. ప్రముఖ షో ‘టాక్‌ ఈజీ’లో మాట్లాడారు. తన హాలీవుడ్ సినిమా గురించి హింట్ ఇచ్చారు.

Advertisement

‘టర్మినేటర్‌’, ‘గ్లాడియేటర్‌’, ‘బ్రేవ్‌హార్ట్‌’ తరహా హాలీవుడ్‌ చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు రామ్‌చరణ్. అలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో చేయాలని తనకూ ఉందని అన్నారు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నెలల్లో నా హాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించిన వార్త వస్తుంది.. అంటూ సంచలన విషయం చెప్పారు రామ్ చరణ్.

ఇక జులియా రాబర్ట్స్‌ ఆయన ఫేవరెట్‌ నటి అట. అతిథి పాత్రలోనైనా ఆమెతో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉందని అన్నారు చరణ్.

Advertisement

టర్మినేటర్, గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్.. సినిమాలు ఓ రేంజ్ లో ఉంటాయి. హాలీవుడ్ రికార్డులు బద్దలుకొట్టిన మూవీస్ అవి. ఆ సినిమాలు చరణ్‌కి ఇష్టం కాబట్టి.. అలాంటి హీరోయిజం వెల్‌వేట్ అయ్యే సినిమానే ఆయన ఎంచుకోవచ్చు. అదే నిజమైతే.. రామ్‌చరణ్ హాలీవుడ్ ఎంట్రీ మామూలుగా ఉండదు.

ఇప్పటికే మగధీర, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో వీరుడు, శూరుడు అనిపించుకున్న చరణ్.. హాలీవుడ్‌లో సూపర్ హీరో తరహా క్యారెక్టర్ చేస్తే.. చూసి తీరాల్సిందే. ఫ్యాన్స్‌కి గూస్‌బంప్సే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×