BigTV English

Kriti Sanon : పెళ్లి గురించి కృతి స‌న‌న్‌కి ప్ర‌భాస్ ఫోన్‌

Kriti Sanon : పెళ్లి గురించి కృతి స‌న‌న్‌కి ప్ర‌భాస్ ఫోన్‌
Kriti Sanon

Kriti Sanon : టాలీవుడ్‌లో వ‌న్ నేనొక్క‌డినే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ కృతి స‌న‌న్‌. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా మారింది. ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ ఆది పురుష్‌లో సీత‌గా న‌టించింది. ఈ ఏడాది జూన్ 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా.. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం త‌ర్వాత ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ మ‌ధ్య ప్రేమ పుట్టింద‌ని, త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు నెట్టింట ఓ రేంజ్‌లో వైర‌ల్ అయ్యాయి. దానికి త‌గ్గ‌ట్లు బేడియా ప్ర‌మోష‌న్స్‌లో సిద్ధార్థ్ మాట్లాడుతూ కృతిస‌న‌న్‌, ప్ర‌భాస్ మ‌ధ్య‌లో ఏదో న‌డుస్తుంద‌న్న‌ట్లు మాట్లాడాడు. దీంతో ఈ వార్త‌లు మ‌రింత పెరిగిపోయాయి.


అయితే కృతి స‌న‌న్ త‌ర్వాత త‌న సోష‌ల్ మీడియా ఆ వార్త‌ల‌ను ఖండించింది. ప్ర‌భాస్ త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మేన‌ని ఆమె చెప్పేసి రూమ‌ర్స్‌కి చెక్ పెట్టేసింది. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆమె మరోసారి ప్ర‌భాస్‌తో రిలేష‌న్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్ర‌భాస్‌కి, నాకు మ‌ధ్య సిద్ధార్థ్ ఏదో ఉంద‌ని చెప్ప‌గానే ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్ నాకు ఫోన్ చేశాడు. నేను ఫోన్ పిక్ చేసి మాట్లాడాను. ఏంటా న్యూస్ అన్న‌ట్లుగా అడిగారు ప్ర‌భాస్ సిద్ధార్థ్ ఓ పిచ్చోడు.. ఏదో మాట్లాడేశాడు.. అని చెప్పాను’’ అని అన్నారు కృతి స‌న‌న్‌.

ఆది పురుష్ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ఆ సినిమాలో న‌టించ‌టం త‌న అదృష్ట‌మ‌ని కూడా ఆమె ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసింది.ఆ చిత్రాన్ని టి సిరీస్ బ్యాన‌ర్‌పై ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ నిర్మించారు. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందుతోన్న ఈ సినిమా తొలి ట్రైల‌ర్ రిలీజైంది. చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఓం రౌత్ ఆది పురుష్ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీపై రీ వ‌ర్క్ చేస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×