E-Paper
Advertisement

Viva Harsha: భార్యతో వైవా హర్ష విడాకులు.. ఇదిగో క్లారిటీ

Viva Harsha: భార్యతో వైవా హర్ష విడాకులు.. ఇదిగో క్లారిటీ
Advertisement

Viva Harsha: ఇండస్ట్రీలో ఉన్నవారికి అతిపెద్ద బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే రూమర్స్. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడితే చాలు.. దాని గురించి పది రకాలుగా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఏదైనా సాడ్ పోస్ట్ పెట్టడం ఆలస్యం విడాకులు అని చెప్పుకొచ్చేస్తారు. సోషల్ మీడియాలో ఒక వారం జంటగా కనిపించకపోతే వారు విడిపోయినట్టే. ఏదైనా ఫంక్షన్ కు సింగిల్ అటెండ్ అయితే.. విడాకులు కన్ఫర్మ్ అన్నట్టే అని రూమర్స్ పుట్టిస్తున్నారు.

ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి రూమర్స్ ను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. తాజాగా కమెడియన్ హర్ష కూడా ఇదే పరిస్థితిను ఎదుర్కొంటున్నాడు. వైవా అనే చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా హర్ష పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకొని కమెడియన్ గా మారాడు. స్టార్ హీరోల సినిమాల్లోనే కాకుండా కుర్ర హీరోలకు ఫ్రెండ్ గా, సత్య తరువాత అంత కామెడీ పంచే కమెడియన్ గా హర్ష పేరు తెచ్చుకున్నాడు.

Advertisement

ఇక గతేడాది సుందరం మాస్టర్ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా హర్ష నటనకు మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ మధ్య స్పీడ్ తగ్గించిన హర్ష.. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.

” జీవితం అనేది రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ లాంటిది. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎగ్జయిట్‌మెంట్‌, చికాకు, భయం, థ్రిల్‌.. ఇలా అన్నీప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. కానీ మనల్ని ఆపడానికి మాత్రం వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. అప్పటివరకు మనం బకెల్‌ పట్టుకుని కూర్చుని రైడ్‌ను ఎంజాయ్‌ చేయాల్సిందే తప్ప ఏం చేయలేం. జీవితంలో దేనిని ఆశించకూడదు. తర్వాత నిరాశ చెందకూడదు. లైఫ్ ఎటు వెళ్తే అటు పోవడమే” అని చెప్పుకొచ్చాడు. దీంతో హర్ష విడాకుల గురించే చెప్తున్నాడని అందరూ రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు.

Advertisement

ఇక ఈ రూమర్స్ ఎక్కువ రావడంతో హర్ష తాను పెట్టిన పోస్ట్ కు కారణం చెప్పాడు. తన పర్సనల్ లైఫ్ బావుందని, ప్రొఫెషనల్ లైఫ్ లోనే చికాకులు అని తెలిపాడు. కొంతమంది రాజకీయాలు చేసి ఛాన్స్ లు రాకుండా చేస్తున్నారని, వాటివలనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్న స్ట్రాంగ్ గా మళ్లీ వస్తాను అని చెప్పుకొచ్చాడు. దీంతో హర్ష విడాకుల వార్తలకు చెక్ పడింది. మరి హర్షతో పాలిటిక్స్ చేసేవారు ఎవరై ఉంటారో అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×