BigTV English

Comedian Kapil sharma: కమెడియన్ తోపాటు మరో ఇద్దరి నటులకు హత్యా బెదిరింపులు.. ఉలిక్కిపడుతున్న బాలీవుడ్..!

Comedian Kapil sharma: కమెడియన్ తోపాటు మరో ఇద్దరి నటులకు హత్యా బెదిరింపులు.. ఉలిక్కిపడుతున్న బాలీవుడ్..!

Comedian Kapil sharma: మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే ప్రత్యేకించి బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సల్మాన్ ఖాన్(Salman khan ), సైఫ్ అలీఖాన్ (SaifAlikhan) మొదలుకొని ఇప్పటివరకు ఎంతోమంది హత్యా బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో కమెడియన్ కపిల్ శర్మ (Kapil sharma ) కూడా హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వెలువబడుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటి? ఎవరి నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్న కపిల్ శర్మ..

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్ శర్మ కి హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు, బంధువులను కూడా చంపుతామని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు సందేశాలు వచ్చాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈమధ్య కాలంలో రాజ్ పాల్ యాదవ్(Rajpal Yadav), సుగంధ మిశ్రా (Sugandha mishra), కొరియోగ్రాఫర్ రెమో డి సౌజా (Remo D souza)లకి కూడా ఇలాంటి సందేశాలు వచ్చాయి. ‘బిష్ణు’ అనే పేరుతో వీరికి బెదిరింపు ఈ – మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడడమే కాకుండా వారి చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని కూడా ఈ-మెయిల్లో పేర్కొన్నారు.


సందేశంలో ఏముందంటే..?

దుండగులు పంపిన మెయిల్స్ లో ఏముంది అనే విషయానికి వస్తే..”మేము మీరు చేసే పనులను గత కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాము. సున్నితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం అవసరమని మేము నమ్ముతున్నాము. ఇది పబ్లిక్ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం అయితే కాదు. మీరు ఈ సందేశాన్ని తీవ్రంగా పరిగణించి ఎవరికీ చెప్పకుండా ఉండాలని మేము కోరుతున్నాము “అంటూ ఈ-మెయిల్లో పేర్కొన్నట్టు పలు మీడియా సంస్థలు కూడా రిపోర్టు చేశాయి. ఇకపోతే ఈ-మెయిల్ పంపిన వ్యక్తి తన డిమాండ్లను ఎనిమిది గంటల్లోగా నెరవేర్చకపోతే ప్రమాదకరమైన పరిణామాలు కూడా ఎదుర్కొంటారని హెచ్చరించారట. అయితే ఆ వ్యక్తి డిమాండ్లు ఏంటి? అనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

పోలీసులను ఆశ్రయిస్తున్న బాలీవుడ్ స్టార్స్..

ఇకపోతే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దవాళ్లను ఇలా ఒక వర్గం వారు ప్రత్యేకించి టార్గెట్ చేస్తుండడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ భయాందోళనలకు గురవుతున్నట్లు సమాచారం.ఇకపోతే హత్య బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో కపిల్ శర్మ పోలీసులను ఆశ్రయించారు. ఆయనకంటే ముందే రాజ్ పాల్ యాదవ్ భార్య కూడా పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరంతా కూడా సమాచారం అందుకున్న తర్వాతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా ఇలా వరుసగా బాలీవుడ్ స్టార్ లందరూ కూడా హత్యా బెదిరింపులు ఎదుర్కొంటూ ఉండడంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. దేనిని టార్గెట్ చేస్తున్నారు? దేనికోసం టార్గెట్ చేస్తున్నారు? అనే స్పష్టత కూడా లేకపోవడం అటు అభిమానులను కూడా కలవరపెడుతోంది. ముఖ్యంగా బెదిరింపులకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలని ఇంకొకరు ఇలాంటి బెదిరింపులకు పాల్పడాలంటేనే భయపడేలా అధికారులు చర్యలు చేపట్టాలని కూడా బాలీవుడ్ సినీ వర్గాలు కోరుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×