BigTV English

Ntr : ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లు తీసుకుంటున్న ఎన్టీఆర్.. ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ntr : ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లు తీసుకుంటున్న ఎన్టీఆర్.. ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ntr : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన చేస్తున్న సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఉన్నాయి. RRR తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది. గతంలో చాలా సినిమాలు నటించిన ఎన్టీఆర్కు ఇంత క్రేజ్ మాత్రం రాలేదు. సినీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ పాస్టర్ హిట్ సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీకి అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన 21 ఏళ్లకే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంచలనం సృష్టించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. అయితే ఎన్టీఆర్ ఫస్ట్ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..


ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ..

ఎన్టీఆర్ చైల్డ్ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1997లో బాల రామాయణం సినిమా లో నటించారు. ఈ మూవీని ఎమ్మెస్ రెడ్డి నిర్మించగా, గుణశేఖర్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ బెస్ట్ డైలాగ్ డెలివరీ, తనదైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.. ఈ సినిమాకి గాను ఉత్తమ బాలునటుడిగా అవార్డును కూడా అందుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఇక అదే ఏడాదిలో వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ‘నిన్ను చూడాలని’ చిత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది. దీని తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా దర్శకు ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది..


ఎన్టీఆర్ మొదటగా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు గాను ఎన్టీఆర్ 4 లక్షల రెమ్యూనిరేషన్ను అందుకున్నట్టు తెలుస్తుంది. అమౌంట్ ని ఎవరికి ఇవ్వాలో తెలియక వాళ్ళమ్మ చేతిలో పెట్టాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ఎన్టీఆర్ చెప్పాడు. అప్పట్లో లక్షల అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కోట్లల్లో రెమ్యూనరేషన్ ని పెంచాడు. ఆయన సినిమాలు కూడా అంతే రేంజ్ లో ఉన్నాయి. త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్ ఆ సినిమాతో మంచి టాక్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీగా కలెక్షన్స్ ని అందుకున్నాడు.. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉంది. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేయబోతున్నట్టు గతంలో అనౌన్స్ చేశారు.. మరికొద్దిరోజుల్లోనే ఆ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లి ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తుంది.

Related News

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Big Stories

×