BigTV English

Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపడానికి రూ. 25 లక్షల సుపారీ.. ‘ఆ గ్యాంగ్‌స్టర్ పనే’

Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపడానికి రూ. 25 లక్షల సుపారీ.. ‘ఆ గ్యాంగ్‌స్టర్ పనే’

Bollywood: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఏప్రిల్ నెలలో హత్యా ప్రయత్నం జరిగింది. ఇందుకు సంబంధించి 1700 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు ఫైల్ చేశారు. ఈ చార్జిషీట్‌లో సల్మాన్ ఖాన్ స్టేట్‌మెంట్ కూడా ఉన్నది. ముంబయి క్రైమ్ బ్రాంచ్ యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ రికార్డ్ చేసిన ఆ స్టేట్‌మెంట్‌లో సల్మాన్ ఖాన్ కీలక వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 14వ తేదీన ఉదయం 5 గంటల ప్రాంతంలో తన ఇంటిపై కాల్పులు జరిగాయని సల్మాన్ ఖాన్ వివరించారు.


‘నేను బాణాసంచా కాల్పుల వంటి శబ్దాలను విన్నాను. అప్పుడు ఉదయం 4.55 గంటలు అవుతున్నది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి కాల్పులు జరిపి పారిపోయారని పోలీసు బాడీగార్డు నాకు చెప్పాడు. ఇంతకంటే ముందు కూడా నన్ను, నా కుటుంబాన్ని గాయపరచడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినట్టు ఆ తర్వాత నాకు తెలిసింది. కాబట్టి, నా బాల్కనీలో కాల్పులు జరిపింది గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మనుషులేనని అనుకుంటున్నాను’ అని సల్మాన్ ఖాన్ వివరించారు.

‘గతంలో కూడా లారెన్స్ బిష్ణోయ్, ఆయన గ్యాంగ్ సభ్యులు కొందరు ఓ ఇంటర్వ్యూలో నన్ను, నా బంధువులను చంపడం గురించి మాట్లాడారు. కాబట్టి, నా కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని చంపాలనే ఉద్దేశ్యంతో నా బాల్కనీలో కాల్పులు జరిపినట్టుగా నేను భావిస్తున్నాను’ అని సల్మాన్ తెలిపారు. గతంలోనూ తనకు వచ్చిన బెదిరింపుల గురించి సల్మాన్ ఖాన్ ఏకరువు పెట్టారు. 2022లో తన తండ్రి సలీం ఖాన్‌కు తమ ఇంటి ఎదురుగా ఉన్న బెంచ్ పై బెదిరింపు లేఖ లభించిందని, అందులో తమ కుటుంబాన్ని బెదిరిస్తూ కొన్ని రాతలు ఉన్నాయని చెప్పారు.


Also Read:  ఆ హీరోయిన్‌తో సాయిధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్?.. క్లారిటీ ఇచ్చిన టీమ్

ఆ తర్వాత 2023 మార్చి నెలలో తన టీమ్ సభ్యుల్లో ఒకరికి తన అఫీషీయిల్ మెయిల్ ఐడీకి లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనను, తనన కుటుంబాన్ని బెదిరిస్తూ మెయిల్ వచ్చిందని సల్మాన్ ఖాన్ వివరించారు. ఇందుకు సంబంధించి బాంద్రా పోలీసు స్టేషన్‌లో కేసు కూడా ఫైల్ అయిందని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఇద్దరు వ్యక్తులు తప్పుడు ఐడీలతో పన్వెల్‌లోని తన ఫామ్ హౌజ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశారని, ఇందుకు సంబంధించి కూడా కేసు నమోదైందని తెలిపారు. ఆ ఇద్దరు రాజస్తాన్‌లోని ఫజిల్కా గ్రామానికి చెందినవారని, లారెన్స్ బిష్ణోయ్ గ్రామం కూడా ఇదేనని సల్మాన్ వివరించారు. తన కుటుంబ సభ్యులు, బంధువులు అందరినీ ఎల్లప్పుడూ జాగ్రత్తగా, జాగరూకతగా ఉండాలని సూచించినట్టు తెలిపారు.

ఏప్రిల్ 14 నాటి ఘటన కేసులో ఇద్దరు షూటర్లను గుజరాత్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్‌ను చంపడానికి రూ. 25 లక్షల కాంట్రాక్ట్‌ను లారెన్స్ బిష్ణోయ్‌కు అందిందని, సల్మాన్ ఖాన్‌ను చంపడానికి ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేసే ప్లాన్ వేసినట్టూ చార్జిషీటు పేర్కొంది. ఐదుగురు వ్యక్తులు సల్మాన్ ఖాన్‌ను చంపే కుట్ర చేస్తున్నట్టు ఆరోపించింది. ఫైరింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయ్, ఆయన తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ సహా 17 మందిపై పోలీసులు కేసు పెట్టారు. లారెన్స్ బిష్ణోయ్ అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×