BigTV English

Sai Dharam Tej: ఆ హీరోయిన్‌తో సాయిధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్?.. క్లారిటీ ఇచ్చిన టీమ్

Sai Dharam Tej: ఆ హీరోయిన్‌తో సాయిధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్?.. క్లారిటీ ఇచ్చిన టీమ్

Mehreen Pirzada: సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లిళ్ల వార్తలు షరామామూలే. సినిమా సెట్‌లో కాకుండా బయట ఒక్కసారి ఇద్దరు కలిసి కనిపించారంటే వారి మధ్య ప్రేమ ఉన్నదని, రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు షికారు చేస్తుంటాయి. సోషల్ మీడియాలో అదే నిజం అన్నట్టుగా భ్రమించేలా పోస్టులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఎదుర్కొంటున్నారు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో వెండి తెరకు పరిచయమైన పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదాతో సాయి ధరమ్ తేజ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. జవాన్‌ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించినప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ పుట్టినట్టు ప్రచారం జరిగింది.


అంతేనా? వీరిద్దరు ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నట్టూ వదంతలు వచ్చాయి. కానీ, మేనమామలు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు వారి వారి పనుల్లో బిజీగా ఉండటం వల్లే పెళ్లి ముహూర్తాలు ఆలస్యం అవుతున్నట్టూ జస్టిఫికేషన్‌లు వచ్చాయి. ఈ వార్తలు ఇద్దరి అభిమానులకు షాక్ ఇచ్చాయి. ఇంత సడెన్‌గా ఈ నిర్ణయాలేమిటీ? వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడమేమిటీ? ఎక్కడా ఎక్కువగా కనిపించలేదే? అనే చర్చ జరిగింది. ఈ ప్రచారం ఉధృతం కావడంతో సాయి ధరమ్ తేజ్ టీమ్ రియాక్ట్ అయింది.

Also Read: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాళ వెబ్ సిరీస్.. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్


హీరోయిన్‌తో ప్రేమ, పెళ్లి వార్తలను సాయి ధరమ్ తేజ్ టీమ్ ఖండించింది. మెహ్రీన్ పిర్జాదాతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలన్నీ అబద్ధాలేనని స్పష్టం చేసింది. సాయి ధరమ్ తేజ్ పెల్లి వార్తలు వట్టి పుకార్లేనని, అందులో వాస్తవం లేదని స్పష్టత ఇచ్చింది. సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని, కాబట్టి, ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచనలు చేసింది. దీంతో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్‌ల లవ్ స్టోరీ, లవ్ మ్యారేజీ న్యూస్‌లన్నీ వట్టి పుకార్లేనని తేలిపోయింది. మరి ఇంతటితోనైనా ఈ అవాస్తవ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా? అనేది చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×