E-Paper
Advertisement

Cooli: రజనీకాంత్ షూటింగ్ పూర్తి అయ్యేది అప్పుడే, కూలీ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్

Cooli: రజనీకాంత్ షూటింగ్ పూర్తి అయ్యేది అప్పుడే, కూలీ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్
Advertisement

Cooli: కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే లోకేష్ కనకరాజ్ అనే పేరు ఒక బ్రాండ్ అని చెప్పాలి. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి “మా నగరం” సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. ఇదే సినిమా తెలుగులో నగరం పేరుతో రిలీజ్ అయింది. సందీప్ కిషన్ రెజీనా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా లోకేష్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాను లోకేష్ తీసిన విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మొదటి సినిమా అయినా కూడా టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఈ సినిమాని ప్రజెంట్ చేశాడు లోకేష్. ఈ సినిమా తర్వాత చేసిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రిలో జరిగే ఈ కథ మొత్తం ఎంతో ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు.

కమలహాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా ఒక సంచలనం. దాదాపు కమల్ కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో విక్రమ్ సినిమా ఇచ్చిన సక్సెస్ మామూలుది కాదు. దాదాపు 400 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. సినిమాటిక్ యూనివర్స్ తెలుగులో పరిచయం చేశాడు లోకేష్. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ కనకరాజు పై ప్రశంసలు కురిపించారు. లోకేష్ టెక్నికల్ గా సినిమాను చాలా బాగా చేస్తారు అంటూ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విక్రం,లియో సినిమాలను ప్రస్తావిస్తూ తెలిపారు. ఇక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ కూలి అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఒక మీడియా ఇంట్రక్షన్లో ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇచ్చాడు లోకేష్.

Advertisement

ఈ సినిమాకి సంబంధించి రజనీకాంత్ సీన్స్ కు సంబంధించిన షూటింగ్ 28 తో పూర్తవుతుందని తెలిపారు. అలానే నాగర్జున చేసే సీన్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి అని తెలిపారు లోకేష్. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. పెద్దపెద్ద స్టార్ కాస్ట్ తో ఈ సినిమాను డిజైన్ చేశాడు లోకేష్. విక్రమ్ సినిమాలో కూడా ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, కమలహాసన్ పాత్రలను చాలా అద్భుతంగా డీల్ చేశాడు. ఇక ఈ సినిమాలో పాత్రలను ఎలా డీల్ చేయబోతున్నాడు అని అందరూ చాలా క్యూరియాసిటి తో ఎదురుచూస్తున్నారు. మామూలుగా లోకేష్ దర్శకత్వం వహించే సినిమాలు కూడా చాలా ఫాస్ట్ గా ఫినిష్ అవుతుంటాయి.

ఇక ప్రస్తుతం రజనీకాంత్ నటించిన “వెట్టయన్” సినిమా దసరా కానుక రిలీజ్ కానుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ని దర్శకుడు చూపించిన విధానం చాలామందిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రానా దగ్గుబాటి వంటి కీలక నటులు కనిపిస్తున్నారు. ఇంత పెద్ద భారీ కాస్ట్ వస్తున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే అక్టోబర్ 10 వ తారీకు వరకు వేచి చూడక తప్పదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×