Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అందరి చూపు అల్లు అర్జున్ పైనే ఉంది. రీసెంట్ గా ఈయన నటించిన పుష్ప 2 మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఒకవైపు విమర్శలు అందుకుంటున్న మరోవైపు కలెక్షన్ల సునామి సృష్టించింది. పుష్ప మూవీతోనే పాన్ ఇండియా వైడ్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. నార్త్ లోనూ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. బన్నీ కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అదొక ఐకానిక్ ఫిల్మ్ గా నిలిచింది. మరోవైపు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అల్లు అర్జున్ క్రేజ్ పెరిగినట్లే అమ్మాయిలు కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్ అయిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ బన్నీని ఫాలో అవుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ అల్లు అర్జున్ అంటే క్రష్ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ఒక్కసారి అల్లు అర్జున్తో అలా చేయాలని ఆశపడుతున్నానని ఆమె అనడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ విజయాన్ని అందుకుంది. బాహుబలి క్రియేట్ చేసిన రూ.1830 కోట్ల కలెక్షన్స్ ను ‘పుష్ప2’ దాటేసింది. కానీ ఈ లెక్కల్లో కాస్తా తేడా ఉందనే వాదన కూడా వినిపించడం గమనార్హం. ఏదేమైనా.. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ తో పుష్ప2 సెన్సేషన్ క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు.. ఈ మూవీ ఓటీటీ లో కూడా ట్రెండ్ అవుతుంది.. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు ఫ్యాన్స్ అవుతున్నారు. కానీ సాధారణంగా హీరోలంటే అమ్మాయిలకు అభిమానం ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు ఆ హీరో లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు.. అయితే తాజాగా ఓ హీరోయిన్ అల్లు అర్జున్ అంటే పిచ్చి అని ఓపెన్ అయ్యింది.
Also Read : ఎన్టీఆర్, ప్రభాస్ కాంబోలో మూవీ.. అదే నిజమైతే ఫ్యాన్స్ కు జాతరే..
బన్నీతో నటించాలని చాలా మంది హీరోయిన్లకు ఆశగా ఉంటుంది. ఒక్క అవకాశం వస్తే చాలు అంటూ ఎంతో ఆసక్తికంగా ఎదురుచూస్తు ఉంటారు. అది జరగకపోయే సరికి ఆయా ఇంటర్వ్యూల్లో తమ మనస్సులోని మాటను బయటపెడుతూ ఉంటారు.. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రియా భవాని.. అల్లు అర్జున్ తో బిగ్ స్క్రీన్ పై రొమాంటిక్ సీన్లలోనైనా నటించేస్తానని చెబుతోంది. ఓ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్ పై తనకున్న క్రష్ ని బయట పెట్టేసింది. ఇప్పటి వరకు ప్రియాభవానీ శంకర్ తెలుగులో మూడు చిత్రాల్లోనే నటించింది. సంతోష్ శోభన్ తో కలిసి ‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆడియెన్స్ ను కట్టి పడేసింది. ఆ తర్వాత గోపీచంద్ ‘భీమా’, సత్యదేవ్ ‘జీబ్రా’.. అలాగే తమిళంలో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. ‘ఇండియన్ 2’, ‘డిమోంటీ కాలనీ 2’, ‘బ్లాక్’, ‘జీబ్రా’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ‘ఇండియన్3’లో నటిస్తోంది. ఇక ఈమె ఫ్యూచర్లో అల్లు అర్జున్తో సినిమా చేయాలని ఆశపడుతుంది ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత అట్లీ తో ఓ మూవీ చేయబోతున్నాడు.