New Liquor: మద్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త లిక్కర్ బ్రాండ్ల విధానానికి ఆహ్వానం పలికింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGBCL) కొత్త లిక్కర్ బ్రాండ్ల దరఖాస్తులకు ఆహ్వానం పలికింది.
ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనుంది. రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానించింది. అనుమతుల విషయంలో ముందు నాణ్యతా ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆయా కంపెనీలు మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తుతో పాటు సెల్ఫ్ సర్టిఫికేషన్ జతపరచాలని ఆ ప్రకనటలో ప్రస్తావించింది టీజీబీసీఎల్. కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పది రోజులపాటు ఆన్ లైన్‌లో పెట్టాలన్నది టీజీబీసీఎల్ నిర్ణయం.
దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలు, ఆపై విచారణ జరిపి అనుమతులపై నిర్ణయం తీసుకోనుంది. టీజీబీసీఎల్ లో రిజిస్టర్ కాబడి సరఫరా చేస్తున్న సప్లయర్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ALSO READ: ఇది కదా భయ్యా మ్యారేజ్ అంటే
ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మద్యం విధానంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మద్యం కొత్త బ్రాండ్ల కంపెనీపై ప్రభుత్వం సమీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టు దిట్టంగా ఉండాలని అప్రమత్తం చేసింది.
ఇదిలావుండగా తెలంగాణలో మూడురోజులపాటు మద్యం షాపులు మూతబడనున్నాయి. మూడు ఎమ్మల్సీ సీట్ల ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు దుకాణాలు బంద్ కానున్నాయి. ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్, ఖమ్మం-నల్గొండ జిల్లాల్లో ఈ ఎన్నికల జరగనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతం సైబరాబాద్ పరిధిలో కొల్లూరు ఆర్ సీ పురం పోలీసుస్టేషన్ల పరిధిలో కల్లు దుకాణాలు, వైన్ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్ లు మూతబడనున్నాయి.