Film industry: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను దుఃఖానికి గురి చేస్తున్నాయి. గత రెండు రోజుల క్రితమే హాంకాంగ్ కి చెందిన యువ నటుడు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు మరొక నటి కన్నుమూసింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ఆగస్టు 12న తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సీనియర్ నటిగా పేరు సొంతం చేసుకున్న ఆమె ఇలా క్యాన్సర్ తో మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆమె ఎవరు? అసలు ఏమి జరిగింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం?
ప్రముఖ నటి మృతి..
ఆమె ఎవరో కాదు ప్రముఖ బెంగాలీ నటి బసంతి ఛటర్జీ (Basanti Chatterjee).. సీనియర్ నటీమణిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. చాలాకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇటీవలే క్యాన్సర్ చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయిన ఈమె.. ఆగస్టు 12న తన ఇంట్లో తొలి శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈమె వయసు 88 సంవత్సరాల. ఐదు దశాబ్దాల సినీ కెరియర్లో దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించారు. ఈమె మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఒక గొప్ప నటీమణిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బసంతి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. అలాగే ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతూ ఉండడం గమనార్హం.
బసంతి ఛటర్జీ సినిమాలు..
బసంతి ఛటర్జీ సినిమాల విషయానికి వస్తే.. మంజరి ఒపేరా, అలో, థాగిని వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు భూతు, బోరాన్, దుర్గా దుర్గేషరి వంటి ప్రముఖ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. ఈమె చివరిసారిగా టెలివిజన్ తో గీత ఎల్.ఎల్.బి అనే సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ చిత్రీకరణ సమయంలోనే ఈమె అనారోగ్యానికి గురైంది. కొన్ని నెలల పాటు క్యాన్సర్ కి చికిత్స తీసుకున్నప్పటికీ పూర్తిగా కోలుకోలేక స్వర్గస్తురాలు అయ్యింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ మొదలు..
ఇకపోతే చిన్నతనంలోనే రంగస్థలం నాటకాలలో నటించడం మొదలుపెట్టిన ఈమె.. అలుపెరుగని బాటసారిలా సినిమాలు, సీరియల్స్ చేస్తూనే తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.. ఇకపోతే ఈమె మరణానికి సంతాపం తెలుపుతూ ప్రముఖ నటుడు భాస్వర్ చటర్జీ సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తపరిచారు. ఆ ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా..” ఆమె ఇటీవల చాలా శారీరక బాధను ఎదుర్కొంది. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, వయసు పైబడుతున్నప్పటికీ ఆమె నైపుణ్యం ఎవరు భర్తీ చేయలేనిది” అంటూ ఆయన తెలిపారు . మొత్తానికైతే ఒక గొప్ప నటిని సినీ ఇండస్ట్రీ కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే బసంతి మరణంతో అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్లు పెడుతున్నారు.
ALSO READ:Sridevi: శ్రీదేవి మరణించినా చెల్లి రాకపోవడానికి కారణం.. 2 దశాబ్దాల మౌనం వెనుక ఏం జరిగింది?