Gundeninda GudiGantalu Today episode February 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాకు ఇంట్లో వాళ్ళు పని చెప్పడం సహించలేని బాలు తన కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాడు. అందుకే మీనాకు బిగ్ సర్ ప్రైజ్ ఇస్తాడు. అది చూసిన ప్రభావతి కోలుకోలేని దెబ్బ తగుతుంది.. మొత్తం ప్లాన్ ప్రకారమే మీనా కోసం ఇంటి ముందు పూల కొట్టు ఏర్పాటు చేస్తాడు బాలు. పూల కొట్టుకు తల్లి ప్రభావతి పేరునే పెట్టి ఆశ్చర్యపరుస్తాడు. పైగా చిన్న కోడలు శృతితో రెబ్బన్ కట్ చేయించి.. అందుకు డబ్బులు కూడా ఇచ్చి అవమానిస్తాడు. అసలు పూలకొట్టు పెట్టడానికి కారణమే శృతికి బుద్ధి చెప్పడానికి అని తన మనసులోని మాటను కూడా బయటపెడ్తాడు. దాంతో ఇంట్లో ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది.. శృతి బాలు పై కోపంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పూల కొట్టు పెట్టినందుకు మీనా ఫుల్ ఖుషి అవుతుంది. నిన్నటివరకు నేను వంటగదిగే పరిమితం అనుకున్నాను. కానీ ఇలా ఒక పూల కొట్టుకి ఓనర్ అవుతానని నేను అస్సలు ఊహించలేదు అని మీనా బాలుపై ప్రశంసలు కురిపిస్తుంది. ఇంటికి కొత్తగా వచ్చిన శృతి నీకు పనికి డబ్బులు కట్టిందని మాకు అల్లుడుగారు అంతా చెప్పారు అమ్మ అని పార్వతి అంటుంది. దానికే నీ చేత పూల కొట్టు పెట్టించారని మాకు చెప్పాడు. ఇక సుమతి కూడా ఆ శృతి ఎక్కువ చేస్తుంది అక్క నేను ఒకసారి మాట్లాడమంటావా అని అంటుంది. అప్పుడే బాలు టిఫిన్ తీసుకొచ్చి అందరికీ ఇస్తాడు కానీ మీ నాకు మాత్రం స్పెషల్ గా మసాలా పూరి తీసుకొచ్చి ఇస్తాడు. అందరి కోసం అన్నీ చేస్తావు నీకోసం నేను ఏది తీసుకురాలేదు ఇది తీసుకో అనేసి ఇవ్వగానే అక్కడున్న వాళ్ళందరూ మురిసిపోతారు. నీ బిజినెస్ ని ఇంకా పెంచుకోవాలని అందరూ ఆశీర్వదిస్తారు. మేము ఇలాగే మంచిగా అన్ని ఏరియాల్లో బిజినెస్ చేయాలని అనుకుంటున్నాం అని బాలు అనగానే చాలా సంతోషం బాబు అని పార్వతి అంటుంది..
అందరి ముందు బాలు చేసిన పనికి శృతి కోపంగా ఉంటుంది రవి పై ఆ కోపాన్ని చూపిస్తుంది. కావాలని నాకు డబ్బులు ఇచ్చాడు. నేను ఏం తక్కువ చేసానని ఇలా అన్నాడు మీ నాన్న సొంత అక్క లాగా భావించాను కాబట్టి నేను డబ్బులు ఇచ్చాను కానీ ఇలా నాకు డబ్బులు ఇవ్వడం ఏమైనా బాగుందా? ఇక ముందరదా అతని సంగతి నేను చూసుకుంటాను అతను ఎలా దారిలోకి పెట్టాలో నాకు బాగా తెలుసు అని శృతి అంటుంది. అప్పుడే ప్రభావతి రూమ్ లోకి వస్తుంది ఏమైందిరా శృతి మీద ఎందుకు అలా అరుస్తున్నావని రవిని కోప్పడుతుంది. ఇక శృతి జరిగిన విషయం చెప్పడంతో బాలు గురించి తెలుసు కదమ్మా ఇంక వాడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇద్దరు పెద్దింటి కోడలు ఉన్నారు. వాళ్ళ వాళ్ళు వస్తే ఈ పూల కొట్టును చూస్తే ఎలా ఫీలవుతారు వాడికి అర్థం కావట్లేదు అని బాలుని తిడుతుంది. నువ్వు బాలు గురించి మర్చిపోమ్మా అదంతా ఏం పట్టించుకోవద్దు వాడి గురించి తెలిసిందే కానీ అనగానే శృతి అలాగే ఆంటీ అంటుంది.
ఇక రాత్రి బాలు మీనా ఇద్దరు వచ్చిన లాభాలు లెక్క పెడుతూ ఉంటారు. ఒక్క రోజు పూలకొట్టుపై రూ.600 లాభం వచ్చిందని బాలు, మీనా లెక్కలు వేస్తుంటారు. ఇదే విషయాన్ని ప్రభావతి గమనిస్తుండటంతో బాలు ఎటకారంగా మీనా కష్టార్జితం రూ.600 అంటూ గొప్పగా చెబుతాడు. కానీ ప్రభావతికి మాత్రం మింగుడుపడదు. వచ్చింది ఆరువందలేగా.. ఏదో ప్రపంచంలో పూల వ్యాపారం అంతా మీరే చేస్తున్నారా? అంటూ విసుక్కుంటుంది. కానీ బాలు మాత్రం తన మాటలతో ఇంకా ప్రభావతికి అసూయ పెంచుతుంటాడు. మీనా పూలకొట్టు ద్వారా వచ్చిన ఆర్డర్లకు సంబంధించిన పనులు చేస్తుంటుంది. పనిలో మునిగిపోతుంటే.. బాలు వచ్చి మీనాను కాస్తా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నావేంటీ అంటాడు. ఇక మీనా బాలు ఇచ్చే సపోర్ట్ కు ఎమోషనల్ అవుతుంది.. ఇదంతా మీ వల్లే వచ్చింది, మీరు వేపించిన ఒక్క అడిగే నా విజయానికి కారణమని మీనా బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మనోజు పూల కొట్టు గురించి చిన్నతనంగా ఉందని అందరి ముందు చెప్తాడు. ఇంకెక్కడ పెట్టుకోవాలని బాలు గొడవకు దిగుతాడు. పూల కొట్టు గురించి పాంప్లెట్లు పంచడానికి పార్కు వద్దకు వెళ్తే అక్కడ మనోజ్ పార్కులో కనిపిస్తే ఆ ఫోటోలను తీసుకుంటాడు నీకు ఇంట్లో ఉంది ఇంకా అనేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎపిసోడ్ లో మనోజ్ గురించి ఇంట్లో బాంబు పేలుస్తాడేమో చూడాలి..