Sridevi: ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అంటూ అన్ని భాషల ప్రేక్షకులను అలరించిన అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR), కృష్ణ(Krishna ), చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna ) వంటి స్టార్ హీరోలతో జతకట్టిన ఈమె వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకటి రెండు చిత్రాలే చేసింది. కానీ అనూహ్యంగా దుబాయ్ లో బాత్ టబ్ లో పడి మరణించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీ అనే చెప్పాలి.
అక్కాచెల్లెలి మధ్య విభేదాలకి కారణం..
ఈరోజు శ్రీదేవి జయంతి కావడంతో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఈమె తన చెల్లితో మాట్లాడకపోవడం.. గత రెండు దశాబ్దాలుగా వీరిద్దరూ మాట్లాడుకోలేదని.. ఆఖరికి శ్రీదేవి చనిపోయినా.. ఈమెను చూడడానికి ఈమె చెల్లి రాకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. మరి అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న ఇంతటి వైరానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
తల్లి మరణంతో అక్కాచెల్లెళ్ల మధ్య విభేదాలు..
అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో శ్రీదేవి.. రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు జన్మించారు. ఈమెకు ఒక చెల్లెలు శ్రీలత కూడా ఉంది. తల్లి రాజేశ్వరితో పాటు శ్రీలత కూడా శ్రీదేవితో పాటే సెట్ లో ఉండడంతో శ్రీలత కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. శ్రీలత దాదాపు 1972 నుంచి 1993 వరకు సినిమా సెట్స్ లో అక్కతో పాటే ఉండేవారు. అలా 21 సంవత్సరాల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచిన శ్రీలత.. అక్కలాగే తాను కూడా నటి కావాలనుకుంది. కానీ ఆమె నటిగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్ గా మారింది. ఇకపోతే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
డబ్బు కోసమేనా?
అసలు విషయంలోకి వెళ్తే శ్రీదేవి సినిమాలలో పీక్స్ లో ఉండగానే.. శ్రీలత తమ పొరుగుంటి అబ్బాయితో వెళ్లిపోయిందని.. ఇక దాన్ని తట్టుకోలేక శ్రీదేవి తల్లి రాజేశ్వరి తన ఆస్తి మొత్తాన్ని శ్రీదేవి పైనే వీలునామా రాసినట్లు సమాచారం. కొంత కాలానికి ఆమె అనారోగ్య భారిన పడడంతో ఒక ఆపరేషన్ చేయించారట. ఆ సమయంలో డాక్టర్ చేసిన తప్పుకు రాజేశ్వరి జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేక 1996లో మరణించింది. ఇక తల్లి మరణంతో సదరు హాస్పిటల్ పై కేసు వేసిన శ్రీదేవి.. ఆ కేసులో గెలిచి నష్టపరిహారంగా రూ.7.2 కోట్లు కూడా పొందింది.
అందుకే అక్కను దూరం పెట్టిన శ్రీలత..
ఇకపోతే తల్లి మానసిక సమస్యతో బాధపడుతున్న సమయంలోనే తన అక్క శ్రీదేవి ఆస్తులన్నింటినీ రాయించుకుందని, పైగా తల్లి మరణం తర్వాత హాస్పిటల్ పరిహారంగా చెల్లించిన రూ.7.2 కోట్లు తనకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుందని శ్రీలత ఆరోపించింది. పైగా ఈ కేసులో కోర్టును ఆశ్రయించగా.. ఆ కేసులో గెలిచి తన వాటాగా రెండు కోట్లు దక్కించుకుంది. అలా డబ్బులు విషయంలో తలెత్తిన వివాదం అక్కాచెల్లెళ్ల బంధాన్ని కాస్త చెరిపేసింది. ఎంతలా అంటే ఆఖరికి శ్రీదేవి మరణించిన తర్వాత కూడా శ్రీలత ఈమె
పార్థివ దేహాన్ని చూడడానికి కూడా రాలేదు అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Sridevi Birth Anniversary: అతిలోక సుందరి శ్రీదేవి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?