Apple Budget MacBook| విద్యార్థులు, సాధారణ యూజర్ల కోసం సరసమైన ఆపిల్ కంపెనీ ధరలో కొత్త మ్యాక్‌బుక్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త మ్యాక్‌బుక్ తయారీ 2025 చివరి నాటికి ప్రారంభమవుతుందని సమాచారం. ఈ ల్యాప్‌టాప్ స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ ఫీచర్లతో బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త ఒరవడిని సృష్టించనుంది.
ధర వివరాలు
ఈ కొత్త మ్యాక్‌బుక్ సాధారణ కొనుగోలుదారులకు $699 (సుమారు ₹58,000), విద్యార్థులకు $599 (సుమారు ₹52,000) ధరలో లభిస్తుంది. ప్రస్తుతం మ్యాక్‌బుక్ ఎయిర్ $999 (సుమారు ₹83,000) లేదా విద్యా తగ్గింపుతో $899 (సుమారు ₹75,000) ధరలో ఉంది. అలాగే మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే ఈ కొత్త మ్యాక్‌బుక్ చాలా తక్కువ ధర ఆప్షన్.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 16 ప్రోలో ఉపయోగించిన A18 ప్రో చిప్‌తో ఈ మ్యాక్‌బుక్ పవర్ పొందుతుంది. ఈ ల్యాప్‌టాప్ పింక్, బ్లూ, యెల్లో రంగుల్లో లభిస్తుంది. ఈ రంగులు యువతకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త ల్యాప్ టాప్‌లో 12.9-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. మ్యాక్‌బుక్ ఎయిర్‌లోని 13.6-అంగుళాల స్క్రీన్ కంటే ఇది కొంచెం చిన్నది. ధరను తక్కువగా ఉంచడానికి ఆపిల్ తక్కువ రిజల్యూషన్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగించవచ్చు.
పనితీరు, బిల్డ్
ఈ మ్యాక్‌బుక్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ (2.7 పౌండ్లు) కంటే తేలికగా ఉంటుందని.. సుమారు 2.5 పౌండ్ల కంటే తక్కువ బరువు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఎయిర్ లైనప్‌లో భాగమా లేక సాధారణ మ్యాక్‌బుక్‌గా ఉంటుందా అనేది ఆపిల్ ఇంకా స్పష్టం చేయలేదు. ఈ ల్యాప్‌టాప్ స్టైలిష్, పోర్టబుల్ డిజైన్‌తో వస్తుంది. ఇది విద్యార్థులకు, రోజువారీ ఉపయోగానికి బాగా సరిపోతుంది.
RAM, స్టోరేజ్, ఆపిల్ ఇంటెలిజెన్స్
ఈ మ్యాక్‌బుక్ బేస్ వేరియంట్‌లో 8GB RAM – 128GB స్టోరేజ్ ఉండవచ్చు. అయితే, చాలా మంది యూజర్లు 256GB స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌ను ఆశిస్తున్నారు. A18 ప్రో చిప్ M-సిరీస్ చిప్‌లన్నీ పవర్‌ఫుల్ కాకపోవచ్చు. కానీ ఆపిల్ ఇంటెలిజెన్స్, AI-ఆధారిత ఫీచర్లను సమర్థవంతంగా నడపడానికి ఇది సరిపోతుంది. ఈ AI ఫీచర్లు స్మార్ట్ టూల్స్ మరియు యాప్‌లను సున్నితంగా రన్ చేస్తాయి, ఇది రోజువారీ టాస్క్‌లకు అనువైనది.
టార్గెట్ ఎవరంటే?
ఈ బడ్జెట్ మ్యాక్‌బుక్ విద్యార్థులు, మిడిల్ క్లాస్ యూజర్ల కోసం రూపొందించబడింది. ఐప్యాడ్ కంటే ఈ మ్యాక్ బుక్ సాంప్రదాయ ల్యాప్‌టాప్ లాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఉదాహరణకు, A16 చిప్‌తో ఉన్న ఐప్యాడ్ విద్యార్థులకు ₹36,900 ధరలో లభిస్తుంది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ఆపిల్‌కు తక్కువ-ధర సెగ్మెంట్‌లో కొత్త ధర వ్యూహాన్ని అందిస్తుంది. ఇది ఆపిల్ యొక్క ల్యాప్‌టాప్ మార్కెట్ వాటాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా క్రోమ్‌బుక్‌లతో పోటీ పడుతుంది. అయితే, ఈ మ్యాక్‌బుక్ ఆపిల్ ఐప్యాడ్ లైనప్‌తో కూడా పోటీ పడవచ్చు.
లాంచ్ ఎప్పుడంటే?
ఆపిల్ ఈ మ్యాక్‌బుక్‌ను 2025 చివరిలో భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించి.. 2026 ప్రారంభంలో షిప్పింగ్ చేయనుంది. లాంచ్ సమయంలో అన్ని స్పెసిఫికేషన్లు స్పష్టంగా వెల్లడవుతాయి. ఈ ల్యాప్‌టాప్ లాంచ్ కాగానే మార్కెట్‌లో కొత్త సెన్సేషన్ కానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?