Ntr – prabhas : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు క్రేజీ కాంబినేషన్ లో సినిమాలు వస్తుంటాయి. ఇక ఇటీవల కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ సైతం మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూప్తున్నారు. మార్కెట్ లో హీరోల డిమాండ్ ను బట్టి డైరెక్టర్లు కాంబినేషన్ ను సెట్ చేసుకుంటున్నారు. ఆ హీరోలతో ఎలాంటి కథలతో సినిమాలు చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుందో ఆలోచించి అలా సినిమాలను డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్ని మల్టీ స్టారర్ మూవీస్ వచ్చాయి. సక్సెస్ అయ్యాయి. అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరోల కాంబోలో వచ్చే సినిమాలు చూసేందుకు ఆరాటపడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే చాలామంది ఫ్యాన్స్ కొన్ని క్రేజీ కాంబోలో సినిమా సెట్ అయితే బాగుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. కానీ.. అవి ఏవేవో కారణాలతో వర్కౌట్ కావు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మల్టీ స్టార్ సినిమాలంటే ఇప్పుడు అంతా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఓ కాంబోలో సినిమా వస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.. ఆ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం..
గతంలో ఓ క్రేజీ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేశారు. అదే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ , రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ. వీరిద్దరూ తోపు హీరోసే. ఇద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఈ కోరిక మాత్రం ఇప్పటివరకు నెరవేరలేదు. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ కూడా గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆయన కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీరిద్దరు కాంబోలో సినిమా రావాల్సి ఉండగా.. అది మిస్ అయింది. ఈ న్యూస్ ఇప్పుడు అందరికీ షాక్‌ను కలిగిస్తుంది.. ఈ మూవీ గురించి ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : ‘పుష్ప 2’ పిల్లలను చెడగొట్టింది.. సెన్సార్ బోర్డు పై హెడ్ మాస్టర్ ఫైర్..
ప్రభాస్ హీరోగా రెబల్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మొదట పవన్ కళ్యాణ్ ని భావించారట రాఘవ లారెన్స్. అయితే అప్పటిలో ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండటంతో కాంబోలో మిస్ అయ్యింది. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో త్రిపుల్ ఆర్ మూవీ వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమా అంటే ఆ ఊహ ఫ్యాన్స్ కూ మరింత ఉత్సహం కలిగిస్తుంది.. ఈ క్రమంలోనే వీళ్ళ కాంబోలో రావలసిన సినిమా మిస్సయింది. అప్పట్లో ఈ సినిమా మిస్సైంది కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరూ స్టార్ రేంజ్ లో ఉన్నారు ఎలాంటి కథతో సినిమా వచ్చినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబోలో ఏ డైరెక్టర్ సినిమా తీస్తారో చూడాలి..