E-Paper
Advertisement

Custody film date fix : మే 12కి ఫిక్స్ అయిన నాగ‌చైత‌న్య‌

Custody film date fix : మే 12కి ఫిక్స్ అయిన నాగ‌చైత‌న్య‌
Advertisement

Custody film date fix : దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ఆ సాహసం చేస్తున్నారు నాగ‌చైత‌న్య‌. గ‌తంలో ఫ‌లితం మిక్స్ డ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ ఈ సారి ధైర్యం చేస్తున్నారు. ఇంత‌కీ ఏంటా సాహ‌సం అంటున్నారా? స‌మ్మ‌ర్ రిలీజ్… అందులోనూ మేలో రిలీజ్‌. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు డైర‌క్ష‌న్‌లో శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో కస్టరీ సినిమాలో న‌టిస్తున్నారు నాగ‌చైత‌న్య‌. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్న బై లింగ్వుల్ సినిమా ఇది. మే 12న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత నిర్ణ‌యించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు నాగ‌చైత‌న్య‌. కృతి శెట్టి నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ ఏడాది కూడా బంగార్రాజులో నాగ‌ల‌క్ష్మి రోల్ చేశారు కృతి శెట్టి. ఇప్పుడు ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

మే 12న అయిన లాంగ్ స‌మ్మ‌ర్ హాలిడేస్ ఉంటాయ‌ని, తెలుగు, త‌మిళ్‌లో ప‌ర్ఫెక్ట్ గా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ఆ డేట్‌కి ఫిక్స్ అయ్యార‌ట‌. ఈ సినిమాలో అర‌వింద్ స్వామి విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా క‌లిసి సంగీతం అందిస్తున్నారు. ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్‌, సంప‌త్‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. అప్పుడెప్పుడో 2017లో మేలో సినిమా రిలీజ్ చేసుకున్నారు నాగ‌చైత‌న్య‌. అది కూడా ఓన్ బ్యాన‌ర్‌లో న‌టించిన రారండోయ్ వేడుక చూద్దాం. అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య ఈగో ప్రాబ్ల‌మ్స్ తో తెర‌కెక్కిన సినిమా అది. ల‌వ్‌స్టోరీగా మెప్పించింది. నెక్స్ట్ ఇయ‌ర్ 2023 మే నాగ‌చైతన్య‌కి ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి. ల‌వ్‌స్టోరీ త‌ర్వాత ప‌ర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు నాగ‌చైత‌న్య‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×