E-Paper
Advertisement

Kushi Rerelease : అబ్బా… వెంక‌టేష్ ఎఫెక్ట్… ప‌వ‌న్ న‌ష్ట‌పోతున్నారా?

Kushi Rerelease : అబ్బా… వెంక‌టేష్ ఎఫెక్ట్… ప‌వ‌న్ న‌ష్ట‌పోతున్నారా?
Advertisement

Kushi Rerelease : చేతులారా చేసుకునే త‌ప్పులు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు మ‌నం త‌ప్పేమీ చేయ‌క్క‌ర్లేదు. ఎవ‌రో చేసిన త‌ప్పుకు మ‌నం శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. అదేంట‌ని అడ‌గ‌లేం? అదెలా కుదురుతుంది అని నిల‌దీయ‌లేం. ఎదుటివాళ్లు చెప్పే మాట‌లు విన‌డం త‌ప్ప ఇంకేమీ చేయ‌లేం…. ప‌క్క‌నోడు చేసిన త‌ప్పుకి మ‌నం బ‌లైపోవ‌డం అంటే ఇదే… ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అచ్చం ఇలాగే ఆలోచిస్తున్నారేమో!. 2022కి హ్యాపీగా బాయ్ చెబుతూ, 2023కి అంతే ఆనందంగా వెల్క‌మ్ చెబుదామ‌ని ఫిక్స్ అయ్యారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న న‌టించిన ఖుషి రీరిలీజ్‌కి డ‌బుల్ జోష్‌తో ప్లానింగ్ చేస్తున్నారు ప్రొడ్యూస‌ర్‌. అంతా సూప‌ర్ అంటున్నారు. రీరిలీజ్ ట్రైలర్‌కి కూడా జ‌బ‌ర్ద‌స్త్ రెస్పాన్స్ వ‌స్తోంది.

12 రోజుల త‌ర్వాత రిలీజ్ అయ్యే సంక్రాంతి సినిమాల‌క‌న్నా ఖుషీ ప్ర‌మోష‌న్లు కూడా జోరుగా న‌డుస్తున్నాయి. రీరిలీజ్ క‌లెక్ష‌న్లలో ఖుషీ త‌ప్ప‌క ట్రెండ్ సృష్టిస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, భూమిక మ‌ధ్య వ‌చ్చే న‌డుము సీన్లు, అలీ కామెడీ, పాట‌లు, ఇప్పటి యూత్‌కి కూడా తెగ న‌చ్చుతాయ‌ని అనుకుంటున్నారు. అయితే ఇక్క‌డే నిర్మాత‌కు ట్విస్ట్ ఇచ్చార‌ట యుఎస్ మ‌ల్టీప్లెక్స్ ఓన‌ర్స్. ఖుషీ రిలీజ్ చేయ‌లేమ‌ని చెప్పేశార‌ట‌. ఇంత‌కు ముందు ఓటీటీలో రిలీజ్ అయి సూప‌ర్‌డూప‌ర్ అని ప్ర‌శంస‌లు అందుకున్న వెంక‌టేష్ నార‌ప్ప‌ను రీరిలీజ్ చేస్తే వాళ్ల‌కు న‌ష్టాలే మిగిలాయ‌ట‌. రీసెంట్ గా రిలీజ్ అయిన మ‌రికొన్ని రీరిలీజులు కూడా పెద్ద‌గా ఏమీ వసూలు చేయ‌లేదట‌. ఇప్పుడు ఖుషీ విష‌యంలోనూ అదే రిపీట్ అయితే న్యూ ఇయ‌ర్‌ని ఊసురోమంటూ స్టార్ట్ చేయ‌లేమ‌ని ఓపెన్‌గానే చెప్పేశార‌ట మ‌ల్టీప్లెక్స్ ఓన‌ర్స్. సో , వెంకీ అండ్ అద‌ర్స్ సినిమాలు చేసిన క‌లెక్ష‌న్లు చూసి శిక్ష ప‌వ‌న్ ఖుషీకి ప‌డింద‌న్న‌మాట‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×