BigTV English

Devara Movie : ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

Devara Movie : ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

Devara Audience Reaction : ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ‘దేవర’ థియేటర్లలోకి వచ్చేశాడు. తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఈరోజు రాత్రి నుంచి ఎక్కడ చూసిన దేవర అనే పదం హోరేత్తిస్తుంది. ఇక మల్టీ ఫ్లెక్స్ లు,సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి.. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలిరోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది. తమ హీరో హీరో సినిమా ఆరేళ్ళత థియేటర్లలోకి రావడంతో ఫ్యాన్స్ అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారు.. గత రెండు రోజుల నుంచి హంగామా చేస్తూ రచ్చ చేస్తున్నారు.. సినిమా సంగతి పక్కనపెట్టి పెడితే ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు.


ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు పెట్టిన దుండగులు..

గ్లోబల్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాథియేటర్లలో సందడి చేస్తుంది. ఈ మూవీ మొదటి షోకి పాజిటివ్‌ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మేరకు తమ హీరో సినిమా బాగుందని సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ థియేటర్ల వద్దే రచ్చ చేస్తూ, సంబరాలు చేసుకుంటున్నారు.. తప్పాసులతో ఆ ప్రాంతం అంతా హోరేత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక హైదరాబాద్ లో ఆర్.టీ.సి క్రాస్ రోడ్డు లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ దగ్ధం అయ్యింది.. అభిమానులు టపాకాయలు కాల్చుతుండగా నిప్పు రవ్వ కటౌట్ మీద పడడంతో కటౌట్ పూర్తిగా దగ్ధం అయ్యిందని సమాచారం.. కానీ ఎవరు దుండగులు నిప్పు పెట్టారానే వార్తలు వినిపిస్తున్నాయి. తమ హీరో కటౌట్ కాలిపోవడం పై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇదిలా ఉండగా.. కడప జిల్లాకి చెందిన మస్తాన్‌ వలి ‘దేవర’ సినిమా చూస్తూ మృతి చెందారు. కడప లోని అప్సర థియేటర్‌ లో ఈ ఘటన జరిగింది. అభిమానుల కోలాహలం మధ్య సినిమా ప్రారంభం అయింది. కొద్ది సేపటికి మస్తాన్ వలి కుప్పకూలడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లగా గుండె పోటు రావడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇది ఫ్యాన్స్ ను కలచివేస్తుంది.. ఇక ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్‌ రచ్చ మామూలుగా ఉండదు. ఓ స్థాయిని మించి అభిమానుల సందడి ఉంటుంది. ప్రతి స్టార్‌ హీరోల సినిమా విడుదల సమయంలో ఫ్యాన్స్ ఏదో ఒక ప్రమాదానికి గురి అయ్యారు అనే వార్తలు రావడం చూస్తూనే ఉంటాం. అయితే దేవర సినిమా ఆడుతున్న థియేటర్‌ లో ఇలాంటి సంఘటన జరగడం పై నిరాశను వ్యక్తం చేస్తున్నారు..

ఇక సినిమా విషయానికొస్తే.. దేవర సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఎక్సట్రా షోలు కూడా పడటంతో ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. ఇప్పటికే మొత్తం కలిపి రూ. 500 కోట్ల వరకు రాబట్టిందని సమాచారం.. సాయంత్రం వరకు ఎంత రాబట్టిందో చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×