E-Paper
Advertisement

Daggubati Venkatesh: విక్టరీ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్

Daggubati Venkatesh: విక్టరీ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్
Advertisement

Daggubati Venkatesh: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంపై రాజకీయ ప్రముఖులతోపాటు సినీ పరిశ్రమ పెద్దలు అభినందనలు తెలిపారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండే విక్టరీ వెంకటేష్ మాత్రం స్పెషల్ విషెష్ తెలిపారు. ‘పిఠాపురం..ఎమ్మెల్యే గారు’ అంటూ ఓ ఆసక్తికరంగా ట్వీట్ చేస్తూ అభినందనలు తెలిపిన విక్టరీ వెంకటేష్… తాజాగా, ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా మరో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో ‘ప్రపంచంలో ఏదైనా సరే.. ఏదో ఒకరోజు మారుతోంది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హేటర్స్ లేని హీరో..

Advertisement

టాలీవుడ్‌లో హేటర్స్ లేని హీరో అంటూ ఎవరైనా ఉన్నారంటే అతనే విక్టరీ వెంకటేష్. వరుస విజయాలతో విక్టరీగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాల్లో కూడా రాజకీయాల రోల్ చేసేందుకు ఇష్టపడని వెంకటేష్.. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత వరుసగా పోస్ట్ చేయడం ఏంటి? అని అభిమానులతోపాటు రాజకీయ వేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ఖమ్మం జిల్లాలో తన వియ్యంకుడు, కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరఫున ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో రఘురాంరెడ్డి సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Also Read: చివరి రోజుల్లో ఆయన్ను దుర్మార్గులు చాలా క్షోభ పెట్టారు.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్

Advertisement

ఒక్క పోస్ట్.. ఎన్నో అర్ధాలు!

ఎన్నికల ఫలితాల తర్వాత విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చారిత్రాత్మక విజయం నమోదు చేయడంపై విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్‌కు ఘోర ఓటమి ఎదురుకావడం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం నేపథ్యంలోనే ఒక్కోరోజులో ఏదైనా మారవచ్చు..అని పోస్ట్ చేసినట్లు కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా బీజేపీకి మెజార్టీ తగ్గడం, కూటమికి బలం పెరిగింది. అలాగే ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఉదయం మృతి చెందడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆనందం, సంతోషం, బాధ తెలియజేస్తూ పోస్ట్ చేశాడా? అంటూ పలువురు అనుకుంటున్నారు. దీంతోపాటు మరో పోస్ట్‌లో రామోజీరావుకు నివాళులర్పించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×