BigTV English

Vaarasudu: దిల్ రాజుకి షాకిస్తున్న ద‌ళ‌ప‌తి విజయ్‌

Vaarasudu: దిల్ రాజుకి షాకిస్తున్న ద‌ళ‌ప‌తి విజయ్‌
dalapati-vijay-shocking-dil-raju

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ వార‌సుడు (త‌మిళంలో వారిసు). సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై తెలుగు ఆడియెన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు. అందుకు కార‌ణంగా.. స్ట్ర‌యిట్ తెలుగు సినిమాల కంటే వార‌సుడు చిత్రానికే దిల్‌రాజు ఎక్కువ థియేట‌ర్స్ దొరికేలా ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే ఆయ‌న వార‌సుడు సినిమాను అధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు కూడా. డ‌బ్బింగ్ సినిమాకు దిల్ రాజు ఇంత ప్రాధాన్య‌త ఇవ్వ‌టంపై చిరు, బాల‌య్య ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు.


త‌న ఇండ‌స్ట్రీకి చెందిన ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను కాద‌నుకుని దిల్ రాజు.. వార‌సుడు సినిమాకే పెద్ద పీట వేస్తున్నారు. ఇంత చేస్తున్న‌ప్ప‌టికీ ద‌ళ‌ప‌తి విజ‌య్ మాత్రం తెలుగు మార్కెట్‌పై పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించలేదు. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోయే వార‌సుడు ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్‌లో విజ‌య్ పాల్గొన‌బోవటం లేద‌ట‌. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నిర్మాత దిల్ రాజు మాత్రమే పాల్గొనే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×