E-Paper
Advertisement

Dasara collections : ఓవ‌ర్ సీస్‌లో నాని ‘దసరా’ జోరు.. ఇదెక్క‌డి మాస్ మావా!

Dasara collections : ఓవ‌ర్ సీస్‌లో నాని ‘దసరా’ జోరు.. ఇదెక్క‌డి మాస్ మావా!
Dasara collections

Dasara collections : నేచుర‌ల్ స్టార్ నాని, నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ట్ కీర్తి సురేష్ న‌టించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ . ప‌క్కా రా అండ్ రస్టిక్ లుక్‌లో నాని న‌టించిన చిత్ర‌మిది. నాని ఇప్పుడు 30వ సినిమా చేస్తున్నారు. ద‌స‌రా ఆయ‌న 29వ సినిమా. అంత‌కు ముందు 28 సినిమాల్లో చేయ‌ని రోల్ ఇదే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజునుంచే భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. రిలీజ్ త‌ర్వాత ఈ చిత్రం అంచ‌నాల‌కు ధీటుగా రాణిస్తోంది. తొలిరోజునే రూ.38 కోట్ల మేర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించిందీ చిత్రం.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే యు.ఎస్‌లో ద‌స‌రా సినిమా వ‌సూళ్లు స్టార్ హీరోల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. విడుద‌లైన రెండో రోజునే ఈ చిత్రం వ‌న్ మిలియ‌న్ గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకోవ‌టంపై ఫ్యాన్స్ ఆనంద‌ప‌డుతున్నారు. ట్రేడ్ వ‌ర్గాలు సైతం ఓవ‌ర్‌సీస్‌లో నాని క్రేజ్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. ఓవ‌ర్ సీస్‌లో ఇక ద‌స‌రా సినిమా హిట్ టాక్ తెచ్చుకుని లాభాల బాట ప‌ట్టాలంటే 1.2 మిలియ‌న్ క‌లెక్ష‌న్స్ వ‌స్తే చాలు. ఇదే జోరుని కొన‌సాగిస్తే రేప‌టి ప్రారంభంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. వీకెండ్ అయిన శ‌ని, ఆదివారాల్లో ఇక వ‌చ్చేదంతా డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు లాభాల‌ను తెచ్చి పెట్టేదే అవుతుంద‌ని అంటున్నారంద‌రూ.

నాని తొలి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. అయితే స్టార్ డైరెక్ట‌ర్‌తో కాకుండా శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌టం గొప్ప విష‌యం. నిర్మాత చెరుకూరి సుధాక‌ర్ ఈ సినిమా కోసం భారీగా ఖ‌ర్చు పెట్టారు. 22 ఎక‌రాల్లో ఓ ప‌ల్లెటూరి సెట్ వేశారు. 90 శాతం సినిమా చిత్రీక‌ర‌ణంతా ఈ సెట్‌లోనే చేశారు. బొగ్గు గ‌నులుండే గోద‌వారి ఖ‌ని ప్రాంతానికి ద‌గ్గ‌ర‌గా ఓ క‌ల్పిత గ్రామాన్ని డిజైన్ చేసి సినిమాను చిత్రీక‌రించ‌టం విశేషం.

for more updates follow this : BIGTV

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×