E-Paper
Advertisement

Dasara Movie : దుమ్మురేపుతున్న దసరా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

Dasara Movie :  దుమ్మురేపుతున్న దసరా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
Advertisement

Dasara Movie : నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన దసరా మూవీకి మంచి టాక్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచడంతో తొలిరోజు థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. దీంతో భారీ వసూళ్లు వచ్చాయి. శ్రీరామనవమి రోజు తెలుగు రాష్ట్రాల్లో దసరా సినిమా సందడే ఎక్కువగా కనిపించింది. ఆంధ్రాలో 410 స్క్రీన్లు, నైజాంలో 300 స్క్రీన్లు, సీడెడ్‌లో 190 స్క్రీన్లపై తొలిరోజు ఈ మూవీని ప్రదర్శించారు.

తెలుగు రాష్ట్రాల్లో 900 స్క్రీన్లకుపైగా ప్రదర్శించిన నాని మొదటి సినిమా ఇదే. ఈ సినిమా తొలి రోజు ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా 65 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో దసరా సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారీగా కలెక్షన్లు రాబట్టింది. 700 షోలకు రూ. 3.8 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చింది. కరెంట్ బుకింగ్ తో కలిపితే తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు సుమారు రూ. 15 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని అంచనా.

Advertisement

హిందీలో 750 స్క్రీన్లు, కర్ణాటకలో 80 స్క్రీన్లు, తమిళనాడులో 80 స్క్రీన్లు, కేరళలో 100 స్క్రీన్లపై దసరా మూవీ సందడి చేసింది. ఓవర్సీస్‌లో దాదాపు 800 స్క్రీన్లపై ప్రదర్శించారు. ఈ సినిమాను తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 2700 స్క్రీన్లపై ప్రదర్శించారు. తొలిరోజు దసరా మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.24.85 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిందని తెలుస్తోంది. నాని గత సినిమా అంటే సుందరానికి ఫైనల్‌గా రూ.25 కోట్లు కలెక్ట్‌ చేస్తే.. దసరా తొలి రోజే ఆ మార్కును అందుకోవడం విశేషం. హిట్ టాక్ రావడంతో తొలివారంలో రూ. 50 కోట్లు మార్కు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

దసరా సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. నైజాం థియేట్రికల్ హక్కులు రూ. 13.7 కోట్లు, సీడెడ్ రూ. 6.5 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.9 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ. 2.35 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 2 కోట్లు, గుంటూరు రూ. 3 కోట్లు, కృష్ణాలో రూ. 2 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ. 1.2 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ రూ. 34.65 కోట్లు జరిగింది. కర్ణాటక థియేట్రికల్ హక్కులు రూ. 1.85 కోట్లు, తమిళ, మలయాళం భాషల హక్కులు రూ. 1.5 కోట్లు చొప్పున, ఉత్తర భారతదేశంలో 4 కోట్లకు అమ్ముడుపోయాయి.

Advertisement

దసరా సినిమా మొత్తంగా 48 కోట్ల మేర బిజినెస్ చేసింది. నాని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బిజినెస్ కావడం విశేషం. అమెరికా, యూకేల్లో దసరా మూవీ ప్రీమియర్ల ద్వారా భారీగా వసూళ్లు చేసింది. ఆస్ట్రేలియాలో మంచి స్పందన వచ్చింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×