E-Paper
Advertisement

Dasara Review : ధూంధాం దసరా.. ఆడు పక్కా తెలంగాణోడు.. బిగ్ టీవీ.. బిగ్ రివ్యూ..

Dasara Review : ధూంధాం దసరా.. ఆడు పక్కా తెలంగాణోడు.. బిగ్ టీవీ.. బిగ్ రివ్యూ..
Advertisement

Dasara Review : ఆడు తెలంగాణోడు… తెలంగాణ ఆత్మను సూపెట్టిండు. ఆడు తెలంగాణోడు… తెలంగాణ పల్లె ప్రజల బతుకు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించిండు. ఆడు ఖడక్ తెలంగాణోడు.. తెలంగాణ సోపతిని కండ్లకు కట్టిండు. ఆడు తెలంగాణోడు ఆదే సోపతి కోసం తెలంగాణోళ్లు పానమిత్తరని సాటింపేసిండు. ఆడే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

దసరా… ఫుల్ లెన్త్ రా కంటెంట్. దోస్తాన్‌కు కులాలు, మతాలు లేవని చెప్పిన సినిమా. దోస్తాన్ కోసం పానాలైనా ఇస్తారని చెప్పిన సినిమా. దసరా పండగ తెలంగాణలో ఎట్ల జరుగుతుందో సూపెట్టిన సినిమా. ఈ దసరాలో ఇంకో కథ కూడా ఉన్నది. ఆ కథే తెలంగాణలో మందు ఎట్ల నడుస్తదో చెప్పింది.

Advertisement

ఇది ఏ ఒక్క రోజో రాసుకున్న కథ కాదు. ఒక్క పూటలోనో వచ్చే ఆలోచన అసలే కాదు. పుట్టిన కానుంచెల్లి ఊరును సూసుకుంటూ రాసుకున్న కథ. తెలంగాణకు చెందిన సింగరేణి ప్రాంతంలో పల్లె ఎట్లుంటది. ఆడ బొగ్గుతో మసిబారిన బతుకులేందన్నది సూపించడంలో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యిండు. ఫస్ట్ ఆఫ్‌లో కీలక సన్నివేశాలను పాటల రూపంలో చెబితే బాగుంటదన్న శ్రీకాంత్ ఆలోచన తెరమీద అద్భుతంగా కనిపించింది.

కల్లులోకి గుడాలు. ముందులోకి అంచుకు బోటి కూర. సోపతిగానితోనే తాగలన్న కుతి ఎట్లుంటది… ఆటి ముచ్చటేందన్నది దసరాలో కనిపిస్తదీ. కథ ఎంత మంచిగ రాసుకున్నడో.. నటీనటులు ఎంపిక విషయంలో శ్రీకాంత్ విజయం సాధించాడు.

Advertisement

నిజంగా నానీ నాచురల్ స్టారే. తన పాత్రలో ఒదిగి పోయాడు. ఇక కీర్తి సురేష్ గురించి ఎంత సెప్పినా తక్కువే. తెలంగాణ పల్లెలోని ఓ అందమైన పిల్ల ఎట్లుంటది.. ఎట్ల మాట్లాడతది… గా పిల్ల హావభావాలు ఎట్లెట్లుంటాయో కీర్తి సురేష్ అచ్చుగుద్దేసింది. మిగతా వారు వారి పాత్రలకు న్యాయం చేశారు. పాటల్లో ఎక్కడా ఆ ఫీల్ మిస్ కాలే. బ్యాగ్రౌండ్ స్కోర్ దసరాకు మరింత బలాన్ని చేకూర్చింది.

క్లైమాక్స్ సినిమాకు మరోబలం.చివరి క్షణంలో తెంపుకొచ్చిన జమ్మి ఆకును నాని.. కీర్తి సురేష్ చేతిలో పెట్టడం భావోద్వేగానికి గురి చేస్తుంది. కథ మందు దుకాండ్లనే సురువైనా.. కొసకు ఆ మందు దుకాణాన్ని నాని కాలవెట్టుడుతో అయిపోతది. మొత్తంగా దసరా పండుగకు పాలపిట్టను సూసినట్లు అనిపించింది… దసరా సినిమా.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×