E-Paper
Advertisement

Is Deepika Padukone Pregnant: మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికా..? రణవీర్‌ తండ్రి కాబోతున్నాడని వార్తలు..

Is Deepika Padukone Pregnant: మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికా..? రణవీర్‌ తండ్రి కాబోతున్నాడని వార్తలు..
Advertisement

Deepika Padukone and Ranveer Expecting their First Baby: దీపికా పదుకొణె, రణవీర్‌ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ దంపతులకు సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి ద్వారా మీడియాకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. దీంతో దీపికకి ప్రస్తుతం రెండో నెల అని అభిమానులు ఊహాగానాలు చేయడం ప్రారంభించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ది వైట్ లోటస్ సీజన్ 3కి తిరిగి రాకూడదని దీపికా నిర్ణయించుకున్నట్లు వెల్లడైన కొద్దిసేపటికే ఆమె గర్భం దాల్చినట్లు ప్రకటన వెలువడటం ఆసక్తికరంగా మారింది. గత నెలలో వచ్చిన సమాచారం ప్రకారం, ప్రముఖ హెచ్‌బీఓ సిరీస్ మూడవ సీజన్‌లో దీపిక కనిపించనుంది. అయితే, వారాంతంలో, దీపికా కార్యక్రమంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

Advertisement

బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌(BAFTA) అవార్డుల ప్రదానోత్సవం దీపికాను చూసిన అభిమానులు ఆమె తల్లి కాబోతోంది అని అనుకుంటున్నారు. ప్రస్తుతం దీపికా ఏ కార్యక్రమంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత నెల ఫైటర్‌ సినిమాకు సంబంధించిన ఒక పోస్టును చూసి దీపికా బరువు పెరిగింది అని అభిమానులు కామెంట్స్‌ పెట్టారు.

Read More: ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డాను.. విడాకుల విషయం గుర్తుచేసుకున్న సమంత..

Advertisement

దీపిక, రణవీర్‌లు ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో పెళ్లి చేసుకున్నారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన రొమాన్స్ చిత్రం ‘గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా’ సెట్స్‌లో వారు మొదట కలుసుకున్నారు. వీరిద్దరూ పద్మావత్, బాజీరావ్ మస్తానీ చిత్రల్లో కూడా నటించారు. గతేడాది నవంబర్‌లో దీపిక, రణ్‌వీర్‌లు తమ ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని బెల్జియంలో జరుపుకున్నారు.

వర్క్ ఫ్రంట్‌లో, ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్లిక్ ఫైటర్‌లో దీపికా పదుకొనే హృతిక్ రోషన్‌తో కలిసి నటించింది. సిద్ధార్థ్ ఆనంద్ సినిమాలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ADలో ప్రభాస్‌తో కలిసి నటిస్తుంది.

రణ్‌వీర్ తన సింబా పాత్రను రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’తో రీమేక్‌ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో దీపిక, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, కరీనా కపూర్, కుమార్‌లతో సహా బాలీవుడ్ నుంచి ఎ-లిస్టర్‌లు కూడా నటించారు. 2025లో విడుదల కానున్న ఫర్హాన్ అక్తర్, డాన్ 3లో రణ్‌వీర్ కనిపించనున్నాడు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×