E-Paper
Advertisement

Bandi Sanjay comments: ఆ మాటంటే చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు..

Bandi Sanjay comments: ఆ మాటంటే చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు..
Advertisement

Bandi Sanjay sensational comments: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నాయకుల మధ్య మాటలు ఘాటెక్కిపోతున్నాయి. చెప్పులతో కొట్టాలంటూ ప్రజలకు రాజకీయ నాయకులు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దూమారం రేపుతోంది. మొన్నటికి మొన్న రైతుబందు అడిగిన వాళ్లను చెప్పుతో కొట్టండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. కాగా.. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అచ్చం అలాగే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుంటే..రాష్ట్రంలో పార్టీలు మారే వారి గురించి, పొత్తుల గురించి రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీతో, బీఆర్ఎస్ పార్టీల పొత్తు పెట్టుకోబోతోందంూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు కూడా జరుపునన్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ అంశంపై బీజేపీ నేతలు స్పందిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించినటువంటి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఛీ కొట్టారని బండి సంజయ్ అన్నారు. అలాంటి పార్టీతో తాము ఎందుకు పొత్తుపెట్టుకుంటామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మద్య పొత్తు ఉంటుందని అనేవాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ ఘాటుగా స్పందించారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య లోపాయికార ఒప్పందం ఉందన్నారు. అందుకే బీజేపీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Read More:  రెండు లివర్లు ఎక్స్‌ట్రా ఆంటీని ఫాలో.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌

Advertisement

బీజేపీ వైపు శ్రీ రాముడు, ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం, ధర్మ సంరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడవ సారి అధికారంలోకి రాబోతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి మూడవ సారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కాబోతున్నారని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×