E-Paper
Advertisement

Deepika Padukone with Baby Bump: బేబీ బంప్ తో దీపికా.. ఓటు వేయడానికి వచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్..!

Deepika Padukone with Baby Bump: బేబీ బంప్ తో దీపికా.. ఓటు వేయడానికి వచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్..!
Advertisement

Deepika Padukone Voted with Baby Bump: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తొలిసారి బేబీ బంప్ తో కనిపించింది. 2024 లో లోక్ సభ ఎన్నికల ఐదో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముంబైలోని ఓ పోలింగ్ స్టేషన్ కు భర్త రణ్ వీర్ తో కలిసి వచ్చింది. త్వరలోనే తల్లి కాబోతున్న దీపికను భర్త చేయిపట్టుకుని జాగ్రత్తగా పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లాడు.

రణ్ వీర్, దీపికా ఇద్దరూ వైట్ డ్రెస్సుల్లో పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ లో బేబి బంప్ తో దీపికా క్యూట్ గా కనిపించంది. ఈ సందర్భంగా రణ్ వీర్..దీపికా చేయి పట్టుకుని పోలింగ్ బూత్ లోకి తీసుకువెళ్లి ఓటు వేయించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

హిట్ సినిమాలతో దూసుకుపోతున్న వీరు దీపికా పదుకొనే రణ్ వీర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. తొలిసారి సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో వచ్చిన రామ్ లీలా సినిమాలో దీపికా, రణ్ వీర్ కలిసి నటించారు. అయితే ఈ సినిమా టైమ్ లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా అనంతరం బాజీరావు మస్తానీ, పద్మావతి వంటి చిత్రాల్లోనూ కలిసి నటించారు.

Also Read: రేవ్ పార్టీ కేసులో పోలీసుల ట్విస్ట్.. హేమకు మైండ్ బ్లాంక్..

Advertisement

ఈ మూవీస్ బాక్సాఫీస్ లో మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే రామ్ లీలా సినిమాతో మొదలైన వీరి స్నేహం, ప్రేమ చివరికి ఏడడుగుల బంధంగా మారింది. 2018 నవంబర్ 14 న ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లైన 6 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో తల్లిదండ్రులు కాబోతున్నామంటూ వీరు గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×